amp pages | Sakshi

చంద్రబాబు మీరు చేసింది 420 పని అర్థం కావడం లేదా..?: జోగి రమేష్‌

Published on Sat, 02/12/2022 - 17:24

సాక్షి, తాడేపల్లి: 14 ఏళ్లలో తాను చేయనిది ఒక దమ్మున్న ముఖ్యమంత్రి చేస్తున్నాడని చంద్రబాబుకి నిద్ర పట్టడం లేదని ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. ఈ మేరకు శనివారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు.. 420 అశోక్ బాబు ఇంటికి వెళ్లి మాపై రుబాబు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, ఘీంకరిస్తున్నాడు. అశోక్ బాబు అనే వ్యక్తి ఒక 420 పనిచేశాడు. అది రాష్ట్ర ప్రజలకందరికీ తెలుసు. తప్పుడు సర్టిఫికెట్‌తో పదోన్నతి పొందారని పిర్యాదు అందింది. 

ఆ ఫిర్యాదును లోకాయుక్త విచారణ చేసి సీఐడీ విచారణకు ఆదేశించింది. సీఐడీ దానిని విచారించి అది నిజమే అని నిర్దారణ చేశాక అరెస్ట్ చేశారు. దీన్ని నిన్నటి నుంచి చంద్రబాబు అండ్ కో నానా యాగీ చేస్తోంది. దీనికి సీఎం జగన్‌కు ఏమి సంబంధం. అసలు ఆయన చేసిన పనిని ఎవరు సమర్థిస్తారు..?. మీరు చేసింది 420 పని అని చంద్రబాబుకి అర్థం కావడం లేదా. ఎవర్ని బెదిరిస్తావ్.. ఇక్కడ ఎవ్వరూ బెదిరిపోరు.

చదవండి: (టీడీపీ నాయకుల బూతుపురాణం.. వాట్సాప్‌లో వైరల్‌)

చంద్రబాబు నిద్రపోవట్లేదు.. నిద్రపోడు కూడా. 14 ఏళ్లలో తాను చేయనిది ఒక దమ్మున్న ముఖ్యమంత్రి చేస్తున్నాడని ఆయనకి నిద్ర పట్టదు. నువ్వు ఎవ్వరి గుండెల్లో నిద్రపోలేవు చంద్రబాబు.. ఇక్కడెవరూ భయపడరు. ఇక్కడ ఉన్నది ఒక ధీశాలి నాయకత్వంలో పనిచేస్తున్న కోదమ సింహాలు. నువ్వు ఎన్ని దొంగ ఏడుపులు ఏడ్చినా 25 సంవత్సరాలు జగన్ సీఎంగా ఉంటారు. అప్పులు అంటున్నాడు.. తెచ్చిన అప్పులు మీలా దోచుకోలేదు. ప్రతి పైసాకి మా దగ్గర లెక్క ఉంది.. ప్రతి ఇంటికి ఆ డబ్బు చేరింది. అభివృద్ది ఒకచోటే కావాలా..? అమరావతిలోనే అభివృద్ది చేయాలా..?. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అభివృద్ది కావాలని తపించే వ్యక్తి జగన్. సమసమాజ స్థాపన కోసం పాటుపడుతున్నది జగన్. 

చదవండి: (‘అశోక్‌బాబైనా.. చంద్రబాబైనా చట్టం ముందు సమానమే..’)

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్నావ్...మళ్లీ తెరిచిన పుస్తకంగా నిలబెట్టిన వ్యక్తి జగన్. ప్రధాని మోదీ నోటి వెంట విభజన వల్ల ఏపీ నష్టపోయింది అంటూ వచ్చిన మాటలు జగన్ పోరాటం వల్లే. ఈ రోజు సబ్ కమిటీ అజెండాలో చేర్చి చర్చించేలా చేసింది జగన్. ఇది జగన్ విజయం. ప్రత్యేక హోదా అంశం ఎప్పటికీ మరుగున పడదు. తెరిచిన పుస్తకంలా ఉంచిన జగన్‌కి ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు. ఇలాంటివి మరుగున పెట్టాలని 420 అశోక్ బాబు వివాదాలను తెస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దమ్మున్న పార్టీ.. మీలా చేవ చచ్చిన పార్టీ కాదు. మీకు దమ్ముంటే ప్రజా సమస్యలపై పోరాడండి. ప్రత్యేక హోదా విషయాన్ని పక్కన పెట్టాలనే ఇలాంటి చిల్లర వేషాలు వేస్తున్నారు. ముగిసిన అధ్యాయాన్ని మళ్లీ మాట్లాడుకుంటున్నాం అంటే అది మేము చేసిన పోరాటమే. తప్పనిసరిగా దీనిపై చర్చ జరుగుతుంది. మనకు మంచి జరిగే రోజు వస్తుంది. అది ఒక్క జగన్‌మోహన్ రెడ్డి వల్లే సాధ్యం అని ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. 

Videos

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

దేవర కోసం దసరా రేస్ నుంచి వెనక్కి తగ్గిన సినిమాలు

మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్ సీపీ

బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా

ప్రచారంలో దూసుకుపోతున్న అరకు ఎంపీ అభ్యర్థి తనూజ రాణి

పెన్షన్ పంపిణీ కష్టాలపై వృద్ధుల రియాక్షన్..

ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు

ఇచ్చేవాడినే కానీ..లాక్కునేవాణ్ని కాదు..

పవన్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్

జనసేనపై పవన్ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ మద్యం ధ్వంసం

ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ బెయిల్ పై నేడు తీర్పు

మహాసేన రాజేష్ కు ఘోర అవమానం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)