దక్షిణఫ్రికాతో మూడో టెస్టు.. విజయం దిశగా ఇంగ్లండ్‌!

Published on Mon, 09/12/2022 - 12:25

లండన్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో ఇంగ్లండ్‌ విజయానికి చేరువైంది. మ్యాచ్‌ నాలుగో రోజు 130 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 97 పరుగులు సాధించింది. ఓపెనర్లు అలెక్స్‌ లీస్‌ (32 బ్యాటింగ్‌), జాక్‌ క్రాలీ (57 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. నేడు మరో 33 పరుగులు చేస్తే ఇంగ్లండ్‌ గెలుస్తుంది.

అంతే కాకుండా మూడు టెస్టుల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంటుంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 154/7తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ మరో నాలుగు పరుగులు జోడించి 158 పరుగులవద్ద ఆలౌటైంది. 40 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 169 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్‌ బౌలర్లు బ్రాడ్‌ (3/45), స్టోక్స్‌ (3/39), అండర్సన్‌ (2/37), ఒలీ రాబిన్సన్‌ (2/40) రాణించారు.
చదవండి: Asia Cup 2022 Final: అలా అయితే రాజపక్స 70 పరుగులకు విలువే ఉండేది కాదు! కానీ..: పాక్‌ మాజీ కెప్టెన్‌

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ