ఆ రికార్డు బంగ్లా క్రికెటర్‌కే సాధ్యమైంది

Published on Wed, 02/03/2021 - 16:20

ఢాకా: బంగ్లాదేశ్‌ స్టార్‌ క్రికెటర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ అరుదైన ఘనత సాధించాడు. సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో తమ దేశం తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు అరుదుగా కనిపిస్తుంటారు. ఉదాహరణకు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వన్డేల్లో, టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.. కానీ టీ20లో మాత్రం అది సాధించలేకపోయాడు. ఇక టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చూసుకుంటే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత అందుకున్నాడు.చదవండి: అతడితో కలిసి ఆడటం అదృష్టం: విలియమ్సన్‌

కానీ బంగ్లా క్రికెటర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ మాత్రం ఒక దేశం తరపున మూడు ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసి ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా ఇన్నింగ్స్‌ సమయంలో తమీమ్‌ ఇక్బాల్‌ 9 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఈ ఘనత అందుకున్నాడు. 2007లో వన్డేల్లో ఆరంగేట్రం చేసిన 31 ఏండ్ల వయసున్న బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 60 టెస్టుల్లో 9 సెంచరీలతో 4,405 పరుగులు, 210 వన్డేల్లో 13 సెంచరీలు, 49 అర్ధ సెంచరీలతో 7,360 పరుగులు చేశాడు. ఇక 78 టీ20 అంతర్జాతీయ మ్యాచులాడి ఒక సెంచరీ,  7 అర్ధ సెంచరీలతో లో 1,758 పరుగులు చేశాడు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ