amp pages | Sakshi

Hanuma Vihari: ఇలాంటి షాట్‌ భారత్‌లో ఆడితే అవుట్‌ కాకపోయేవాడిని!

Published on Sat, 06/05/2021 - 03:46

ఇంగ్లండ్‌లో అడుగు పెట్టిన భారత క్రికెట్‌ జట్టు సభ్యులకు ఈ టూర్‌కు ముందు సరైన ప్రాక్టీస్‌ లభించలేదు కానీ జట్టులోని ఒక ఆటగాడు మాత్రం ఇదే సిరీస్‌ కోసం చాలా రోజులుగా సన్నద్ధమవుతున్నాడు. ఎక్కడో కాకుండా అదే ఇంగ్లండ్‌ గడ్డపై ఆడుతూ తన ఆటకు అతను పదును పెట్టుకున్నాడు. అతనే గాదె హనుమ విహారి. కౌంటీ క్రికెట్‌లో వార్విక్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ ఆంధ్ర బ్యాట్స్‌మన్‌ మూడు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి టెస్టు సిరీస్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. మూడేళ్ల క్రితం ఇక్కడే అరంగేట్రం చేసిన విహారి ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాడు.

లండన్‌: ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు చిరస్మరణీయ విజయంలో భాగంగా ఉన్న హనుమ విహారి సిడ్నీ టెస్టులో గాయపడి జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు కోలుకున్న అనంతరం మరోసారి టీమిండియా సభ్యుడిగా జట్టులో భాగమయ్యాడు. 2018 సిరీస్‌లో ఓవల్‌ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన విహారి అదే మ్యాచ్‌లో అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇన్నేళ్లలో తన ఆటతీరు మారిందని చెబుతున్న విహారి ‘క్రిక్‌ఇన్ఫో’ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంట ర్వ్యూలో పలు అంశాలపై తమ అభిప్రాయాలు వెల్లడించాడు. విశేషాలు అతని మాటల్లోనే...

ఇంగ్లండ్‌లో బ్యాటింగ్‌ పరిస్థితులపై...
నిజంగా ఇక్కడ బ్యాటింగ్‌ పెద్ద సవాల్‌ వంటిదే. ఎండ కాసినప్పుడు బ్యాటింగ్‌ కొంత సులువవుతుంది కానీ ఆకాశం మబ్బు పట్టి ఉంటే చాలు ఒక్కసారిగా కష్టంగా మారిపోతుంది. దాదాపు రోజంతా బంతి స్వింగ్‌ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా డ్యూక్‌ బంతులు బాగా ప్రభావం చూపిస్తాయి. బౌలర్లకు పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. క్రీజ్‌లో నిలదొక్కుకున్నామని అనిపించిన సమయంలో కూడా అనూహ్య స్వింగ్‌ ఇబ్బంది పెడుతుంది. డ్యూక్‌ బంతులపై సీమ్‌ ఎక్కువగా ఉండటం కూడా కారణం.  

కౌంటీల్లో అనుభవంపై...
నేను ఇంగ్లండ్‌కు వచ్చిన సమయంలో బాగా చలిగా ఉంది. ఆ వాతావరణంలో బంతి మరింత ప్రభావం చూపించింది. అందుకే నా తొలి కౌంటీ మ్యాచ్‌లో చాలా ఇబ్బంది పడ్డాను. బ్రాడ్‌ బౌలింగ్‌ను సరిగా ఎదుర్కోలేక డకౌట్‌ అయ్యాను. ఇక్కడ డ్రైవ్‌ చేయడం కూడా అంత సులువు కాదు. ఇదే తరహా షాట్‌ నేను భారత్‌ లో ఆడి ఉంటే అవుట్‌ కాకపోయేవాడిని. ఇంగ్లండ్‌లో ఆడుతున్నప్పుడు షాట్‌ సెలక్షన్‌ చాలా ముఖ్యం. అయితే మెల్లగా అన్నీ చక్కదిద్దుకొని తర్వాతి మ్యాచ్‌లో అర్ధసెంచరీ చేశాను. స్టాన్స్‌ కూడా మార్చుకున్నాను.  ఇప్పుడు ఈ అనుభవమే నాకు పెద్ద బలం. టీమిండియా తరఫున బాగా ఆడేందుకు ఇదంతా అక్కరకొస్తుంది.  

2018తో పోలిస్తే ఈ సిరీస్‌పై...
అప్పుడు నా మొదటి టెస్టు ఆడాను. అనుభవం లేని కుర్రాడిని. బ్యాటింగ్‌ చేసేటప్పుడు కాళ్ల కదలికలు కూడా భిన్నంగా ఉండేవి. అందుకే అండర్సన్, బ్రాడ్‌ ఇన్‌స్వింగర్లను ఎలా ఆడాడో కోహ్లి సూచించాల్సి వచ్చింది. వాటిని నేను అమలు చేశాను కూడా. అయితే ఇప్పుడు నా ఆట చాలా మెరుగైంది. స్వింగర్లను సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నా. నా బ్యాటింగ్‌పై నియంత్రణ పెరిగింది.  క్రీజ్‌లో కదలికలు ఎలా ఉండాలో బాగా తెలుసు. అదనంగా కౌంటీ అనుభవం కూడా వచ్చింది కాబట్టి ఈ సిరీస్‌లో మంచి స్కోర్లు సాధిస్తాననే నమ్మకం ఉంది.

చదవండి: మా ఆయన మహా ముదురు.. అప్పటికే గర్ల్‌ ఫ్రెండ్‌ ఉండేది

Videos

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

పులివెందులలో జోరుగా వైఎస్ భారతి ప్రచారం

సుజనా చౌదరికి కేశినేని శ్వేత కౌంటర్..

జగన్ ది ప్రోగ్రెస్ రిపోర్టు..బాబుది బోగస్ రిపోర్టు

కూటమి బండారం మేనిఫెస్టో తో బట్టబయలు

బాబు, పవన్ తో నో యూజ్ బీజేపీ క్లారిటీ..

పచ్చ బ్యాచ్ బరితెగింపు...YSRCP ప్రచార రథంపై దాడి

నేడు మూడు చోట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచార సభలు

జగనే మళ్లీ సీఎం.. అరుకులో ప్రస్తుత పరిస్థితి...అభివృద్ధి

ఏపీలో కూటమి మేనిఫెస్టో తో తమకు సంబంధం లేదన్న బీజేపీ

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)