మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడిన ఫకర్‌ జమాన్‌

Published on Tue, 02/14/2023 - 16:55

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) ఎనిమిదో ఎడిషన్‌ ఓపెనింగ్‌ మ్యాచ్‌లో నిన్న (ఫిబ్రవరి 13) లాహోర్‌ ఖలందర్స్‌- ముల్తాన్‌ సుల్తాన్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముల్తాన్‌ సుల్తాన్స్‌పై లాహోర్‌ టీమ్‌ పరుగు తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లాహోర్‌ జట్టు.. ఫకర్‌ జమాన్‌ (42 బంతుల్లో 66; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్‌ సెంచరీతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. మీర్జా బేగ్‌ (32), షాయ్‌ హోప్‌ (19), సికందర్‌ రజా (19 నాటౌట్‌), తలాట్‌ (20) ఓ మోస్తరుగా రాణించారు. సుల్తాన్స్‌ బౌలర్లలో ఇహ్సానుల్లా, ఉసామా మీర్‌ తలో 2 వికెట్లు, అకీల్‌ హోసేన్‌, దహాని చెరో వికెట్‌ దక్కించుకున్నారు. 

అనంతరం 176 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన సుల్తాన్స్‌.. మహ్మద్‌ రిజ్వాన్‌ (50 బంతుల్లో 75; 8 ఫోర్లు, సిక్స్‌) హాఫ్‌ సెంచరీతో చెలరేగినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. రిజ్వాన్‌కు జతగా షాన్‌ మసూద్‌ (35), డేవిడ్‌ మిల్లర్‌ (25), కీరన్‌ పోలార్డ్‌ (20), కుష్‌దిల్‌ షా (12 నాటౌట్‌) ఓ మోస్తరుగా రాణించారు. ఖలందర్స్‌ బౌలర్‌ జమాన్‌ ఖాన్‌ వేసిన ఆఖరి ఓవర్లో సుల్తాన్స్‌ 15 పరుగులు సాధించాల్సి ఉండగా.. కేవలం 13 పరుగులు మాత్రమే వచ్చాయి. ఫలితంగా సుల్తాన్స్‌ పరుగు తేడాతో ఓడింది. నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఖలందర్స్‌ ఓపెనర్‌ ఫకర్‌ జమాన్‌ ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. పీఎస్‌ఎల్‌లో 2000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో బాబర్‌ ఆజమ్‌ మాత్రమే ఈ మైలురాయిని అధిగమించాడు. పీఎస్‌ఎల్‌లో 68 మ్యాచ్‌లు ఆడిన బాబర్‌ 2413 పరుగులు సాధించగా.. 64 మ్యాచ్‌లు ఆడిన ఫకర్‌ జమాన్‌ 2005 పరుగులు చేశాడు.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ