వారెవ్వా.. క్రిస్టియన్‌ సూపర్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌

Published on Sun, 04/18/2021 - 18:12

చెన్నై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఫీల్డర్‌ డేనియల్‌ క్రిస్టియన్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిశాడు. అప్పటికే రెండు సిక్సర్లు కొట్టి ఊపు మీదున్న గిల్‌ జేమిసన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు.  అయితే అనూహ్యంగా బంతి బ్యాట్‌ ఎడ్జ్‌కు తాకి మిడాన్‌ దిశగా వెళ్లింది. అయితే అప్పటికే అక్కడ వేచివున్న సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ క్రిస్టియన్‌ ఒకవైపు డైవ్‌ చేస్తూ స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో కేకేఆర్‌ 23 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. క్రిస్టియన్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌ వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ మ్యాక్స్‌వెల్‌, డివిలియర్స్‌ మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ ప్రస్తుతం 6 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ