amp pages | Sakshi

షేక్‌ రషీద్‌ సహా ఏడుగురు అండర్‌-19 ఆటగాళ్లకు బిగ్‌షాక్‌!

Published on Tue, 02/08/2022 - 12:52

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఆడాలన్న కలతో ఉన్న భారత అండర్‌-19 కుర్రాళ్లకు గట్టిషాక్‌ తగిలింది. అండర్‌-19 ప్రపంచకప్‌ సాధించిన యంగ్‌ ఇండియాలోని 8 మంది ఆటగాళ్లు ఐపీఎల్‌ మెగావేలానికి దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా ఫైనల్‌ మ్యాచ్‌లో అర్థసెంచరీతో రాణించిన ఆంధ్ర కుర్రాడు.. వైస్‌కెప్టెన్‌ షేక్‌ రషీద్‌ సహా మరో ఏడుగురు లిస్ట్‌లో ఉన్నారు. వయసు, ఇతర కారణాల రిత్యా వీరందరు వేలంలో పాల్గొనే అవకాశం లేనట్లు తెలిసింది.  

బీసీసీఐ నిబంధనల ప్రకారం.. 
►ఐపీఎల్‌ వేలంలో పాల్గొనాలంటే.. కనీసం ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లేదా లిస్ట్ ఏ మ్యాచ్ ఆడిన అనుభవం ఉండాలి.
►ఆటగాడికి దేశవాళీ క్రికెట్ ఆడిన అనుభవం లేకపోతే, అతను ఐపీఎల్ వేలంలో కూడా భాగం కాలేడు. 
►అంతేకాదు వేలంలో పాల్గొనడానికి ఆటగాడి వయస్సు కూడా 19 సంవత్సరాలు ఉండాలి. ఇది ఇప్పుడు 8 మంది ఆటగాళ్లకు పెద్ద అవరోదంగా మారింది.  

చదవండి: Mohammed Siraj: 'క్రికెట్‌ వదిలేయ్‌.. మీ నాన్నతో వెళ్లి ఆటో తోలుకో'

కాగా అండర్19 ప్రపంచ విజేత భారత జట్టు నుంచి కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ సహా వైస్ కెప్టెన్ షేక్ రషీద్,  వికెట్ కీపర్ దినేష్ బానా,  ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ రవికుమార్, ఆల్ రౌండర్లు నిశాంత్ సింధు, సిద్ధార్థ్ యాదవ్, ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ, మానవ్ ప్రకాష్, గర్వ్ సంగ్వాన్‌లు ఐపీఎల్‌ మెగావేలం ఫైనల్‌ లిస్టులో చోటు దక్కించుకున్నారు. కెప్టన్‌ యశ్‌ ధుల్‌ మినహా ఏ ఒక్క ఆటగాడి వయసు కనీసం 19 సంవత్సరాలు నిండలేదు. అంతేకాదు ఈ ఎనిమిది మంది ఆటగాళ్లలో ఒక్కరు కూడా దేశవాలీ క్రికెట్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. దీంతో యష్‌ ధుల్‌ ఒక్కడే వేలంలో కనిపించే అవకాశం ఉంది. అయితే ఈ ఎనిమిది ఆటగాళ్లు దేశవాలీ టోర్నీలు ఆడకపోవడానికి పరోక్షంగా బీసీసీఐ కారణం. కరోనా కారణంగా ఈ రెండేళ్లలో దేశవాలీలో మేజర్‌ టోర్నీలు ఎక్కువగా జరగలేదు. రెండేళ్లపాటు నిర్వహించని రంజీ ట్రోఫీని కూడా ఈ ఏడాదే నిర్వహించనున్నారు. 

అయితే ఈ ఆటగాళ్లు ఆడతారా లేదా అనే దానిపై బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కరోనా కారణంగా గత రెండేళ్లలో దేశవాళీ క్రికెట్ అంతగా ఆడలేదని బోర్డులోని కొందరు అభిప్రాయపడ్డారు. దీంతో నిబంధనల్లో సడలింపు ఇచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 17 నుంచి రంజీ ట్రోఫీని నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ క్రీడాకారుల రాష్ట్ర జట్టు అవకాశం కల్పించినా.. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగే వేలానికి అర్హులు కారు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఇందులో 228 క్యాప్డ్, 355 అన్‌క్యాప్డ్ ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు.

చదవండి: ఆర్సీబీ కెప్టెన్‌గా జాసన్ హోల్డర్‌.. రాయుడుతో పాటు.. రూ. 27 కోట్లతో భారీ స్కెచ్..!

Videos

వల్లభనేని వంశీ తో సాక్షి స్ట్రెయిట్ టాక్

బిగ్ క్వశ్చన్: వాలంటీర్లపై కక్ష..అవ్వాతాతలకు శిక్ష

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

మా మద్దతు సీఎం జగన్ కే

పవన్ కళ్యాణ్ కు పోతిన మహేష్ బహిరంగ లేఖ

కొల్లు రవీంద్రకు పేర్నినాని సవాల్

భారీగా పట్టుబడ్డ టీడీపీ, జనసేన డబ్బు..!

YSRCPని గెలిపించండి అని సభ సాక్షిగా చంద్రబాబు

గాంధీల కంచుకోటలో టికెట్ ఎవరికి ?

ఏపీ రాజకీయాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)