IPL 2022 Final: వారు గెలవాలని మనసు కోరుకుంటోంది.. కానీ: అక్తర్‌

Published on Sun, 05/29/2022 - 11:12

IPL 2022 Final GT Vs RR- Winner Prediction: ఆస్ట్రేలియా క్రికెట​ దిగ్గజం, దివంగత షేన్‌ వార్న్‌ కోసమైనా రాజస్తాన్‌ రాయల్స్‌ ఈసారి ఐపీఎల్‌ టైటిల్‌ గెలవాలని పాకిస్తాన్‌ మాజీ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ అన్నాడు. వార్న్‌కు నివాళిగా ట్రోఫీ సాధించి చిరస్మరణీయ విజయం సొంతం చేసుకోవాలని ఆశించాడు. అయితే అదే సమయంలో.. గుజరాత్‌ టైటాన్స్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఆ జట్టే విజేతగా నిలుస్తుందని అంచనా వేశాడు.

కాగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ మొదటి సీజన్‌ ఐపీఎల్‌-2008లో రాజస్తాన్‌ రాయల్స్‌కు సారథ్యం వహించిన షేన్‌ వార్న్‌.. అరంగేట్రంలోనే జట్టుకు టైటిల్‌ అందించాడు. చరిత్ర సృష్టించాడు. అయితే, ఆ తర్వాత రాజస్తాన్‌ మళ్లీ ఫైనల్‌ చేరుకోవడానికి పద్నాలుగేళ్లు పట్టింది. 

మరోవైపు ఐపీఎల్‌-2022తో మెగా టోర్నీలో అడుగుపెట్టిన గుజరాత్‌ టైటాన్స్‌ వరుస విజయాలతో ఈ ఎడిషన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం(మే 29) ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది.

ఈ నేపథ్యంలో షోయబ్‌ అక్తర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మనసేమో రాజస్తాన్‌ గెలవాలని కోరుకుంటే.. ఓ ఆటగాడిగా కొత్త జట్టు గుజరాత్‌ ట్రోఫీ గెలిస్తే బాగుంటుందని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘రాజస్తాన్‌ 14 ఏళ్ల తర్వాత మరోసారి ఫైనల్‌ చేరింది. ఎన్నో సవాళ్లు అధిగమించి వాళ్లు ఇక్కడిదాకా చేరుకున్నారు.

షేన్‌ వార్న్‌ జ్ఞాపకార్థం వాళ్లు గుజరాత్‌ను ఓడించి టైటిల్‌ గెలవాలి. వార్న్‌ కోసమైనా రాజస్తాన్‌ గెలవాలని మనసు కోరుకుంటోంది. అయితే, ముందు నుంచి చెప్పినట్లుగా కొత్త టీమ్‌ గుజరాత్‌ టోర్నీ ఆసాంతం అదరగొట్టింది. కాబట్టి గెలుపొందేందుకు గుజరాత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి’’ అని స్పోర్ట్స్‌కీడాతో అక్తర్‌ చెప్పుకొచ్చాడు. మొత్తానికి హార్దిక్‌ పాండ్యా బృందానికే తన ఓటు వేశాడు ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌. 

చదవండి 👇
IPL 2022 Prize Money: ఐపీఎల్‌ విజేత, ఆరెంజ్‌ క్యాప్‌, పర్పుల్‌ క్యాప్‌ విన్నర్లకు ప్రైజ్‌మనీ ఎంతంటే!
IPL 2022 Final: ఎవరు గెలిచినా చరిత్రే.. టాస్‌ ఓడితే మాత్రం అంతే సంగతులు! అయితే..
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ