వైరల్‌: బాబు ఈ కొత్త షాట్‌ పేరేంటో

Published on Sat, 01/30/2021 - 21:11

బిగ్‌బాష్‌(బీబీఎల్‌ 10) లీగ్‌లో పెర్త్‌  స్కార్చర్స్‌ ఆటగాడుజోష్ ఇంగ్లిస్ క్రికెట్‌ ప్రపంచానికి కొత్త షాట్‌ను పరిచయం చేశాడు.  సిడ్నీ సిక్సర్స్‌ బౌలర్‌ బెన్‌డార్సిస్‌ వేసిన వైడ్‌ డెలివరిని ఇంగ్లిస్‌ చివరి నిమిషంలో ఫ్లిక్‌ చేశాడు. కాగా ఎవరు ఊహించిన విధంగా బంతి బ్యాట్‌ వెనకవైపు తాకుతూ కీపర్‌ను దాటుకుంటూ వేగంగా బౌండరీలైన్‌ దాటింది. ఇంగ్లిస్‌ ఆడిన ఈ తరహా షాట్‌ ఇప్పటివరకు ఎవరు చూడలేదు. ఈ కొత్త షాట్‌కు క్రికెట్‌ పుస్తకాల్లో కూడా పేరు  లేదు.

శనివారం  సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన  ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో ఈ షాట్‌ నమోదైంది.ఇంగ్లిస్‌ ఆడిన షాట్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా ట్విటర్‌లో షేర్‌ చేసింది. జోష్‌ ఇంగ్లిస్‌ కొత్త షాట్‌ ఏమైనా కనిపెట్టాడా చెప్పండి అంటూ కామెంట్‌ చేసింది. అయితే అతని షాట్‌ చూసిన కామెంటేటర్లు.. ఓ.. నో.. బిగ్‌బాష్‌ లీగ్‌లో అతి దారుణమైన షాట్‌ ఇదే అంటూ కామెంట్‌ చేశారు. అయితే ఇంగ్లిస్‌ ఆడిన షాట్‌ మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 'ఇంగ్లిస్‌ నువ్వు ఆడిన ఈ కొత్త షాట్‌కు పేరేంటి బాబు.. కవర్‌ డ్రైవ్‌.. స్ట్రెయిట్‌ డ్రైవ్‌ లాగా బ్యాక్‌వర్డ్‌ డ్రైవ్‌ అయి ఉండొచ్చు.' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చదవండి: ఆసీస్‌ జట్టులో విభేదాలు.. కారణం అతనే!

కాగా సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో పెర్త్‌ స్కార్చర్స్‌ ఘోర పరాజయం మూటగట్టుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన పెర్త్‌ స్కార్చర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఇంగ్లిస్‌ 69 పరుగులు(5 ఫోర్లు, 2 సిక్సర్ల)తో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్‌ టర్నర్‌ 33 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ సిక్సర్స్‌ ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సిడ్నీ బ్యాటింగ్‌లో జేమ్స్‌ విన్స్‌ 53 బంతుల్లోనే 98 పరుగులు( 14  ఫోర్లు, ఒక సిక్సర్‌తో) వీరవిహారం చేయగా.. మరో ఓపెనర్‌ జోష్‌ ఫిలిపి 45 పరుగులతో రాణించాడు. చదవండి: అది జాతీయ జంతువు.. అందుకే కట్‌ చేయలేదు

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)