మూడో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌ జట్టుకు భారీ షాక్‌..!

Published on Mon, 08/23/2021 - 16:07

లండ‌న్‌: టీమిండియాతో బుధవారం నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌ జట్టుకు భారీ షాక్ త‌గిలింది. భుజం గాయంతో ఆ జట్టు స్టార్‌ పేసర్ మార్క్ వుడ్ హెడింగ్లీ టెస్ట్‌కు దూర‌మ‌య్యాడు. లార్డ్స్ టెస్ట్ నాలుగో రోజు ఆట‌లో ఈ ఇంగ్లీష్‌ పేసర్‌ గాయ‌ప‌డ్డాడు. మూడో టెస్ట్ సమయానికి అత‌డు కోలుకుంటాడ‌ని ఇంగ్లండ్ జట్టు యాజమాన్యం భావించింది. అయితే వుడ్‌ పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌లేక‌పోవడంతో అతను మూడో టెస్ట్‌కు దూరంగా ఉంటాడని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) ప్రకటించింది. 

అయితే మార్క్‌ వుడ్‌ జట్టుతోనే ఉంటాడ‌ని, వైద్యుల పర్యవేక్షణలో కోలుకోవ‌డంపై దృష్టిసారిస్తాడ‌ని ఈసీబీ వెల్లడించింది. మూడో టెస్ట్ అనంతరం అత‌నికి మరోసారి ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహిస్తామని, అప్పటికీ కోలుకోలేకపోతే సిరీస్‌ నుంచి తప్పిస్తామని పేర్కొంది. కాగా, గాయాల కారణంగా ఇప్ప‌టికే స్టువర్ట్‌ బ్రాడ్‌, జోఫ్రా ఆర్చ‌ర్‌, క్రిస్‌ వోక్స్‌, బెన్ స్టోక్స్‌ లాంటి స్టార్‌ పేసర్ల సేవలను కోల్పోయిన ఇంగ్లండ్‌ జట్టును తాజాగా వుడ్‌కు తగిలిన గాయం మరింత కలవరపెడుతోంది. భారత్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో రెండు టెస్ట్‌ల అనంతరం 0-1తో వెనుకబడిన రూట్‌ సేనకు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
చదవండి: ఈ టీమిండియా క్రికెటర్లు ఫ్యాట్‌గా ఉంటే ఎలా ఉండేవారో ఓ లుక్కేయండి..!

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ