బ్రౌన్‌ డాగ్‌.. బిగ్‌ మంకీ అంటూ సిరాజ్‌పై మరోసారి

Published on Sun, 01/10/2021 - 17:52

సిడ్నీ: ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు ఆదివారం మరోసారి చేదు అనుభవం ఎదురైంది. శనివారం మూడో రోజు ఆటలో భాగంగా సిరాజ్‌, బుమ్రాలపై జాతి వివక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే క్రికెట్‌ ఆస్ట్రేలియా బీసీసీఐని క్షమాపణ కోరింది. మరోవైపు ఐసీసీ కూడా దీనిని సీరియస్‌గా భావించి కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తుంది. ఇదంతా జరిగి ఒకరోజు గడవక ముందే మరోసారి సిరాజ్‌పై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది.(చదవండి: బుమ్రా, సిరాజ్‌లపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు)

నాలుగోరోజు ఆటలో భాగంగా రెండో సెషన్‌లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ సిరాజ్‌ను కొందరు 'బ్రౌన్‌ డాగ్‌, బిగ్‌ మంకీ' అంటూ కామెంట్ చేశారు. దీంతో సిరాజ్ అంపైర్లను ఆశ్రయించి మరోసారి ఫిర్యాదు చేశాడు. సిరాజ్‌తో పాటు కెప్టెన్‌ రహానే ఫిర్యాదుతో కాసేపు చర్చించుకున్న అంపైర్లు ఆటను నిలిపివేసి పోలీసులను రంగంలోకి దింపారు. తనపై కామెంట్ చేసిన వారిని సిరాజ్ గుర్తించాడు. వెంటనే పోలీసులు వాళ్లను స్టేడియం నుంచి బయటికి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. ఇప్పటికే ఈ విషయంపై బీసీసీఐ గుర్రుగా ఉంది. టీమిండియా క్రికెటర్లు వెంటనే మేనేజ్మెంట్‌కు తెలియజేశారు. దీనిపై టీమిండియా మేనేజ్మెంట్ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.(చదవండి: కెప్టెన్‌తో గొడవ.. టీమ్‌ నుంచి వెళ్లిపోయిన ఆల్‌రౌండర్‌)

ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ఐసీసీ, టీమిండియా ఫిర్యాదును స్వీకరించి విచారణకు సిద్ధమైంది. సిడ్నీ క్రికెట్ మైదానం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న 'వెన్యూస్ న్యూసౌత్ వేల్స్' తో కలిసి సీసీ టీవీ కెమెరాల ఫుటేజిని పరిశీలిస్తోంది. కాగా క్రికెటర్లపై ఇలా జాతి వివక్ష కామెంట్లు చేసే ప్రేక్షకులను స్టేడియానికి రాకుండా జీవితకాలం నిషేధం విధించాలంటూ పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియాలో పర్యటించే క్రికెట్ జట్లకు ఇలాంటి అనుభవాలు కొత్త కాదు. గతంలోనూ అనేక వివాదాలు వర్ణ వివక్ష వ్యాఖ్యల ఫలితంగానే జరిగాయి. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే సిడ్నీ వేదికలో హర్భజన్‌, సైమండ్స్‌ల మధ్య చోటుచేసుకున్న మంకీ గేట్ వివాదం ఎంత రచ్చగా మారిందో అందరికి తెలిసిందే.(చదవండి: కిందా మీదా పడ్డాడు.. చివరకు రనౌట్‌ చేశాడు)

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ