National Open Athletics: ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ శ్రీనివాస్‌కు కాంస్యం

Published on Mon, 09/20/2021 - 10:09

సాక్షి, వరంగల్‌ స్పోర్ట్స్‌: జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు. అమ్లాన్‌ బొర్గోహైన్‌ (అస్సాం; 20.75 సెకన్లు) స్వర్ణం సాధించగా... నితిన్‌ (తమిళనాడు; 21.06 సెకన్లు) రజతం గెల్చుకున్నాడు.

200 మీటర్ల రేసు విజేతలకు తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ (శాట్స్‌) చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి పతకాలను ప్రదానం చేశారు. ‘ద్రోణాచార్య’ అవార్డీ నాగపురి రమేశ్‌ వద్ద శ్రీనివాస్‌ శిక్షణ తీసుకుంటున్నాడు. 13 స్వర్ణాలు, 10 రజతాలు, 13 కాంస్యాలతో కలిపి మొత్తం 36 పతకాలు నెగ్గిన రైల్వేస్‌ ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది.

చదవండి: Virat Kohli: ఐపీఎల్‌ కెప్టెన్సీపై కోహ్లి కీలక నిర్ణయం

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ