amp pages | Sakshi

ఎస్‌ఆర్‌హెచ్‌ విజయం ఖాయమేనా?

Published on Fri, 10/02/2020 - 19:08

దుబాయ్‌:  ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా సీఎస్‌కేతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.  టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ముందుగా బ్యాటింగ్‌కు మొగ్గుచూపాడు. ఇప్పటివరకూ ఇరుజట్లు మూడేసి మ్యాచ్‌లు ఆడి తలో మ్యాచ్‌లు గెలిచాయి. దాంతో రెండు విజయాన్ని అందుకోవడానికి పూర్తిస్థాయిలో బరిలోకి దిగాయి. సన్‌రైజర్స్‌ ఆడిన గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించి ఖాతా తెరిచింది. మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. ఇక సీఎస్‌కే తాను ఆడిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిచి శుభారంభం చేయగా, ఆ తర్వాత గెలుపును అందుకోలేకపోయింది. బ్యాటింగ్‌ విభాగంలో పటిష్టంగా లేకపోవడంతో సీఎస్‌కే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయం చెందింది. దాంతో ఎలాగైనా గెలుపును అందుకోవాలనే కసితో ఉంది. ఈ రోజు మ్యాచ్‌లో అంబటి రాయుడు తిరిగి జట్టులో చేరాడు. ఫిట్‌నెస్‌ లేని కారణంగా గత రెండు మ్యాచ్‌ల్లో ఆడని రాయుడు,..ఎస్‌ఆర్‌హెచ్‌తో తుది జట్టులోకి వచ్చాడు. డ్వేన్‌ బ్రేవో. శార్దూల్‌ ఠాకూర్‌లు కూడా జట్టులోకి వచ్చారు. మురళీ విజయ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, హజిల్‌వుడ్‌లకు విశ్రాంతినిచ్చారు.

ఇక ఎటువంటి మార‍్పులు లేకుండా పోరుకు సిద్ధమైన ఆరెంజ్‌ ఆర్మీ కూడా విజయపరంపరను కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. దాంతో ఇరుజట్ల మధ్య ఆసక్తికర పోరు సాగే అవకాశం ఉంది. ఇరుజట్ల మధ్య ఇప్పటివరకూ 13 మ్యాచ్‌లు జరిగాయి. అందులో సీఎస్‌కే 10 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, ఎస్‌ఆర్‌హెచ్‌ మూడింట విజయం సాధించింది. కాగా, ఈ సీజన్‌లో దుబాయ్‌లో ఇప్పటివరకూ తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టే విజయం సాధించింది. దాంతోనే టాస్‌ గెలిచిన వెంటనే డేవిడ్‌ వార్నర్‌ తొలుత బ్యాటింగ్‌కు మొగ్గుచూపడానికి కారణం కావొచ్చు. ఇప‍్పటివరకూ దుబాయ్‌లో ఆరు ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగ్గా అందులో ముందుగా బ్యాటింగ్‌ చేసిన జట్టుదే విజయం. మరి సన్‌రైజర్స్‌ విజయం ఖాయమేనా.. కాదా అనేది చూడాల్సిందే.(చదవండి: ‘అతనేమీ మ్యాచ్‌ విన్నర్‌ కాదు’)

ఎస్‌ఆర్‌హెచ్‌ ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే టాపార్డర్‌లో నలుగురు ఆటగాళ్లు కచ్చితంగా రాణించాల్సిందే. డేవిడ్‌ వార్నర్‌ కనీసం పది ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉంటే ఎస్‌ఆర్‌హెచ్‌కు తిరుగుండదు. ఇక బెయిర్‌ స్టో, మనీష్‌ పాండే, విలియమ్సన్‌లు ఆకట్టుకుంటే ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌లో నిలకడ వస్తుంది. గత మ్యాచ్‌లో బౌలింగ్‌ విభాగంలో ఆకట్టుకుని విజయం సాధించిన ఎస్‌ఆర్‌హెచ్‌.. బ్యాటింగ్‌లో కూడా ఫర్వాలేదనిపించింది. వార్నర్‌, బెయిర్‌ స్టో, విలియమ్సన్‌లు రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. ఇది మనీష్‌ పాండే కూడా గాడిలో పడితే సీఎస్‌కేకు గట్టిపోటీ ఇస్తుంది.

సీఎస్‌కే
ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌), షేన్‌ వాట్సన్‌, అంబటి రాయుడు, డుప్లెసిస్‌, కేదార్‌ జాదవ్‌, డ్వేన్‌ బ్రేవో, రవీంద్ర జడేజా, సామ్‌ కరాన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, పీయూష్‌ చావ్లా, దీపక్‌ చాహర్‌

ఎస్‌ఆర్‌హెచ్‌
డేవిడ్‌ వార్నర్‌(కెప్టెన్‌), జానీ బెయిర్‌ స్టో, మనీష్‌ పాండే, కేన్‌ విలియమ్సన్‌, అబ్దుల్‌ సామద్‌, అభిషేక్‌ శర్మ, ప్రియాం గార్గ్‌, రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌, టి. నటరాజన్‌

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)