-
IPL 2024: పిచ్చెక్కిస్తున్న సన్‌రైజర్స్.. ఈసారి టైటిల్ పక్కా..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఏ రేంజ్లో రెచ్చిపోతున్నారో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ సీజన్లో ఆరెంజ్ ఆర్మీ గతంలో ఎన్నడూ లేనంతగా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఇంతటి సమతూకమైన జట్టు బహుశా పొట్టి క్రికెట్ చరిత్రలో ఎక్కడా లేదనే చెప్పవచ్చు. బ్యాటింగ్ విభాగంలో సన్‌రైజర్స్ ప్రదర్శన న భూతో న భవిష్యతి అన్న చందంగా ఉంది. ఈ జట్టులో ఉన్నటువంటి విధ్వంసకర వీరులు యావత్ పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఏ జట్టులోనూ లేరు. ఓపెనర్ల దగ్గరి నుంచి ఎనిమిది, తొమ్మిదో స్థానం ఆటగాళ్ల వరకు అందరూ మెరుపు వీరులే ఉన్నారు.ఓపెనర్లు అభిషేక్, హెడ్ ఊచకోత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీరిద్దరు తమకెదురైన ప్రతి బౌలర్‌ను గడగడలాడిస్తున్నారు. వీరి దెబ్బకు బ్యాటింగ్ రికార్డులు ఒక్కొటిగా బద్దలవుతూ ఉన్నాయి. వీరిద్దరి తర్వాత బ్యాటింగ్‌కు దిగే మార్క్రమ్, క్లాసెన్ విధ్వంసం ఇంకో లెవెల్లో ఉంది. వీరు కూడా తమేమీ తక్కువ కాదు అన్నట్లు విధ్వంసం సృస్టిస్తున్నారు.మార్క్రమ్ గత కొన్ని మ్యాచ్‌లుగా లయ తప్పినట్లు కనిపిస్తున్నా క్లాసెన్ మాత్రం అవకాశం దొరికిన ప్రతిసారి రెచ్చిపోతున్నాడు. ఈ నలుగురితో పాటు యువ ఆల్‌రౌండర్లు నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్‌లు కూడా తమ దాకా వస్తే మెరుపులు మెరిపిస్తున్నారు.బౌలింగ్ విభాగంలో సైతం సన్‌రైజర్స్ చాలా పటిష్టంగా ఉంది. స్వింగ్ సుల్తాన్ భునేశ్వర్ కుమార్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇతనికి కమిన్స్, నటరాజన్, ఉనద్కత్ తోడవుతున్నారు. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం స్పిన్నర్ విజయ్‌కాంత్ వియాస్కాంత్ పర్వాలేదనిపించాడు. షాబాజ్ అహ్మద్, నితీశ్ రెడ్డి కూడా బంతితో రాణిస్తున్నారు.సన్‌రైజర్స్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలతో పాటు ఫీల్డింగ్‌లోనూ పటిష్టంగా ఉంది. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో నితీశ్, సన్వీర్ సింగ్ పట్టిన క్యాచ్‌లే ఇందుకు నిదర్శనం. ఈ సీజన్లో సన్‌రైజర్స్ బెంచ్ కూడా చాలా పటిష్టంగా ఉంది. ఎంతలా అంటే.. బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లతో మరో సమతూకమైన జట్టును తయారు చేయవచ్చు. మొత్తంగా ఈ సీజన్లో ఆరెంజ్ ఆర్మీ గతంలో ఎన్నడూ లేనట్లు అత్యంత పటిష్టంగా కనిపిస్తూ టైటిల్ దిశగా పరుగులు పెడుతుంది. ఈసారి సన్‌రైజర్స్ టైటిల్ ఎగరేసుకుపోవడం పక్కా అని అభిమానులు ధీమాగా ఉన్నారు. విశ్లేషకులు, మాజీలు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. -
SRH vs LSG: ఏమా పరుగుల విధ్వంసం.. లక్నో చిత్తు
-
SRH Vs LSG: ప్లే ఆఫ్స్ రేసు.. రెండింటికీ కీలక మ్యాచ్
-
మరో బిగ్ మ్యాచ్.. సన్‌రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
-
వాటే మ్యాచ్.. ఆఖరి బంతికి రాయల్స్‌పై రైజర్స్ గెలుపు
-
Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
-
Anchor Sreemukhi: ఉప్పల్ స్టేడియంలో యాంకర్ శ్రీముఖి సందడి (ఫోటోలు)
-
IPL 2024 RR vs SRH: సై అంటే సై అంటున్న కొదమసింహాలు
-
సన్‌రైజర్స్‌ను చిత్తు చేసిన సీఎస్కే
-
SRH Vs RCB Photos: నిన్న హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్‌కు వెళ్ళలేదా అయితే ఈ ఫోటోలు చూడాల్సిందే
-
తగ్గేదేలే అంటున్న కమిన్స్..ఆర్సీబీ పరిస్థితి ఏంటో?
-
ఉప్పల్‌లో ఉల్లాసంగా SRH, RCB ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
-
Kaviya Maran: వేలకోట్లకు ఏకైక వారసురాలు.. కావ్యా మారన్ గురించి ఈ విషయాలు తెలుసా? (ఫోటోలు)
-
బౌలర్లపై దయలేని సన్ రైజర్స్.. పాపం ఢిల్లీ
-
సన్‌రైజర్స్‌ను ఢీకొట్టనున్న ఢిల్లీ.. ఈసారి!
-
బెంగళూరులో దుమ్మురేగొట్టిన ఆరెంజ్ ఆర్మీ ‘ఓ రేంజ్’ బ్యాటింగ్ (ఫొటోలు)
-
RCB Vs SRH: చిన్నస్వామి స్టేడియంలో సత్తా చాటేదెవరు?
-
అక్కడ అందరి ముందే దుస్తులు మార్చుకోవాలి: యాంకర్ వింధ్య
ఇది ఐపీఎల్ సీజన్. తెలుగులో ఓ అమ్మాయి చక్కగా మాట్లాడుతోంది. బాడీ లాంగ్వేజ్ ప్రొఫెషనల్‌గా ఉంది. ఏ ముంబై అమ్మాయో అనుకునేటట్లు ఉంది. ఆ అమ్మాయి పేరు 'వింధ్య విశాఖ' మేడపాటి. 20 మంది యాంకర్లను వెనక్కినెట్టి, వ్యాఖ్యాతగా అవకాశం దక్కించుకన్న మొదటి తెలుగమ్మాయిగా వింధ్య రికార్డు సృష్టించింది. స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా మగవాళ్లను మాత్రమే చూసిన తెలుగు తెరకు పరిచయమైన తొలి తెలుగమ్మాయి. ఐపీఎల్ సీజన్-11 నుంచి హోస్ట్‌గా క్రికెట్ అభిమానులను ఆమె ఆకర్షిస్తోంది. తాజాగా తన మోడలింగ్ రోజుల గురించి పలు విషయాలను ఆమె పంచుకుంది. ఎక్కువగా మగవారు మాత్రమే ఉన్న క్రికెట్ రంగంలో కుటుంబసభ్యుల ప్రోత్సహం వల్లే తాను కెరీర్లో రాణించగలుగుతున్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వింధ్య తెలిపారు. డిగ్రీ సెకండియర్‌లో ఉన్నప్పుడు న్యూస్ ప్రజెంటర్‌గా, మోడల్‌గా అవకాశాలు ఎక్కువగా వస్తున్నప్పుడు చదువుని నిర్లక్ష్యం చేయకూడదని తన అమ్మగారి షరతు పెట్టడంతో ఎం.ఏ ఇంగ్లీష్ పూర్తి చేసినట్లు ఆమె చెప్పారు. ఆ తర్వాత ఆమె కొంతకాలం పాటు మోడలింగ్‌లోనూ శిక్షణ పొందానని పేర్కొన్నారు. (ఇదీ చదవండి: 63 ఏళ్ల టాప్ హీరోతో సినిమా.. నో చెప్పిన మీనా) అలా కాలేజీ రోజుల్లోనే పలు అందాల పోటీల్లో పాల్గొన్న వింధ్య విన్నర్‌గా కూడా రాణించినట్లు తెలిపింది. దీంతో ఎలాగైనా మోడలింగ్ చేయాలనే ఆలోచన రావడంతో చదువు పూర్తి అయన తర్వాత మోడలింగ్‌లో శిక్షణ తీసుకున్నట్లు ఆమె అన్నారు. 'సుమారు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఒక ఫ్యాషన్ వీక్‌లో నేను పాల్గొన్నాను. అదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ షో గా నా కెరియర్లో మిగిలిపోయింది. అక్కడి వాతావరణం చూసిన తర్వాత ఈ రంగం నాకు ఏ మాత్రం సెట్ కాదని అనుకున్నాను. ఆ ఫ్యాషన్ షో కోసం వచ్చిన అమ్మాయిలకు దుస్తులు మార్చుకోవడానికీ సరైన గదులు కూడా లేవు. బ్యాక్ స్టేజ్ వద్ద అందరి ముందు దుస్తులు మార్చుకోవాల్సి ఉంటుంది. అది చూసి కొంత సమయం పాటు షాకయ్యా. ఆ క్షణంలోనే నిర్ణయం తీసుకున్నా ఈ రంగం నాకు ఏ మాత్రం సెట్ కాదనిపించింది. ఆ ఒక్క షో వల్ల మోడలింగ్‌ను వదిలేశాను. ఇది నాకు ఎదురైన అనుభవాన్ని మాత్రమే చెప్పుతున్నాను. అన్ని చోట్లా ఇలాగే ఉంటుందనేది నా అభిప్రాయం కాదు.'అని వింధ్య తెలిపారు. ఆమెకు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. గోపాల గోపాల, ముకుందా వంటి చిత్రాల్లో కూడా తనకు అవకాశం వచ్చినట్లు వింధ్య చెప్పారు. కానీ తనకు సినిమా రంగం అంటే పెద్దగా ఆసక్తి లేకపోవడంతో ఆ చిత్రాలకు నో చెప్పినట్లు ఆమె అన్నారు. -
ఉప్పల్ మ్యాచ్ టికెట్లు నిమిషాల్లో సోల్డ్ అవుట్.. అభిమానులకు మరోసారి నిరాశే
-
SRH vs PBKS: గెలుపు ఎవరిది?
-
నితీశ్ కుమార్‌రెడ్డి ధనాధన్ ఇన్నింగ్స్.. SRH ఉత్కంఠ విజయం
-
#Dhoni: కమిన్స్‌కు ‘షాకిచ్చిన’ ప్రేక్షకులు.. అట్లుంటది ధోనితోని!
IPL 2024- SRH vs CSK- Dhoni Entry Viral Video: మహేంద్ర సింగ్ ధోని.. ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదు.. ఒక ఎమోషన్.. ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు హైదరాబాద్ ప్రేక్షకులు. తలా మైదానంలో అడుగుపెట్టగానే ఆరెంజ్ ఆర్మీ సైతం ధోని నామస్మరణతో అభిమానం చాటుకుంది. ఇక సీఎస్కే ఫ్యాన్స్ తమ జెండాలు రెపరెపలాడిస్తూ ధోనికి ఘన స్వాగతం పలికారు. కేవలం అభిమానులు మాత్రమే కాదు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు సైతం ధోని ఆగమనాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్- సన్‌రైజర్స్ మ్యాచ్ సందర్భంగా ఈ అందమైన దృశ్యాలు చోటుచేసుకున్నాయి. Overwhelming Yellove! Chaala Thanks, Hyderabad! 🥳💛#SRHvCSK #WhistlePodu 🦁💛 pic.twitter.com/nZIYuBrbdA — Chennai Super Kings (@ChennaiIPL) April 5, 2024 ఇక ధోని క్రేజ్‌ను చూసి సన్‌రైజర్స్ సారథి ప్యాట్ కమిన్స్ ఆశ్చర్యపోయాడు. తమ సొంతమైదానంలో సీఎస్కే స్టార్‌కు ప్రేక్షకులు స్వాగతం పలికిన తీరును తాను ముందెన్నడూ చూడలేదన్నాడు. ధోని బ్యాటింగ్‌కు రాగానే.. మైదానం దద్దరిల్లిపోయిందని.. ఇంత వరకూ తాను అంత శబ్దం ఎప్పుడూ వినలేదంటూ ధోని క్రేజ్‌కు ఫిదా అయ్యాడు. కాగా శుక్రవారం ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. సీఎస్కేను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. స్లో వికెట్‌పై పరుగులు తీసేందుకు చెన్నై బ్యాటర్లు బాగా ఇబ్బంది పడ్డారు. ఓపెనర్లు రచిన్ రవీంద్ర (12), రుతురాజ్ గైక్వాడ్(26) నిరాశపరచగా.. అజింక్య రహానే(35) నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అయితే, శివం దూబే మాత్రం(24 బంతుల్లో 45) తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఐదో స్థానంలో వచ్చిన రవీంద్ర జడేజా(23 బంతుల్లో 31) నాటౌట్‌గా నిలవగా.. ఏడో స్థానంలో డారిల్ మిచెల్(13) దిగడంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే, నటరాజన్ బౌలింగ్‌లో మిచెల్ అవుట్ కాగానే ధోని ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. From Orange 🧡, To Yellow 💛 For MS Dhoni 🫶🏻 ft. Hyderabad #TATAIPL | #SRHvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/iGYeoxxCvi — IndianPremierLeague (@IPL) April 6, 2024 తలా అలా గ్రౌండ్లో అడుగుపెట్టగానే కేరింతలతో ఉప్పల్ స్టేడియం ప్రాంగణం దద్దరిల్లిపోయింది. ధోని ఒక్క పరుగు చేసి అజేయంగా నిలిచాడు. ఇక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి సీఎస్కే 165 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. ఏదేమైనా ధోని ఎంట్రీ ఈ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. వైజాగ్‌లో వింటేజ్ ధోని విధ్వంసం విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్-2024లో ధోని తొలిసారి బ్యాటింగ్ చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ కేవలం 16 బంతుల్లోనే 37 పరుగులు రాబట్టాడు. There is nothing beyond Thala's reach 🔥💪 #IPLonJioCinema #Dhoni #TATAIPL #DCvCSK pic.twitter.com/SpDWksFDLO — JioCinema (@JioCinema) March 31, 2024 చదవండి: #Kavya Maran: పట్టపగ్గాల్లేని సంతోషం.. కావ్యా మారన్ పక్కన ఎవరీ అమ్మాయి? 2024? 2005? 🤔#DCvCSK #WhistlePodu #Yellove🦁💛pic.twitter.com/T6tWdWO5lh — Chennai Super Kings (@ChennaiIPL) March 31, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సొంత మైదానంలో వరుసగా రెండో విజయం
-
IPL 2024: క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం.. ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత
సాక్షి,హైదరాబాద్: ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న ఉప్పల్ స్టేడియం వద్ద క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మ్యాచ్ టికెట్లున్నా లోపలికి అనుమతించడం లేదంటూ స్టేడియం వద్ద క్రికెట్ అభిమానులు ఆందోళనకు దిగారు. స్టేడియం ఎంట్రీ గేట్ 4 వద్ద ఉన్న బారికేడ్లను తోసేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, క్రికెట్ ఫ్యాన్స్‌కు మధ్య తోపులాట జరిగడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు టికెట్లున్నవారందరినీ క్యూలో ఉంచి ఒక్కొక్కరినీ లోపలికి పంపించడంతో గొడవ సద్దుమణిగింది. టాటా ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్), చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఉప్పల్ స్టేడియానికి క్రికెట్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కావడంతో ధోనీ అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియంకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇదీ చదవండి.. క్రికెట్ అభిమానులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్‌న్యూస్ -
IPL 2024: క్రికెట్ అభిమానులకు ఆర్టీసి ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్..
ఐపీఎల్-2024 సందర్భంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈరోజు (05-04-2024) సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ని వీక్షించడానికి భారీగా అభిమానులు వెళ్లనున్నారు. దీంతో స్టేడియం పరసర ప్రంతాల్లో సాధారణ ప్రయాణీకులకు ఎదురయ్యే ఇబ్బందులను గురించి ట్విట్టర్ లో ఆర్టీసి ఎండీ సజ్జనార్ "ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టండి. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్లే క్రికెట్ అభిమానుల కోసమే హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులను ఉప్పల్ స్టేడియానికి #TSRTC నడుపుతోంది. ఈ బస్సులు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరుతాయి. వీటిని ఉపయోగించుకుని క్షేమంగా స్టేడియానికి వెళ్లి క్రికెట్ మ్యాచ్ ని వీక్షించాలని #TSRTC యాజమాన్యం కోరుతోందని తెలిపారు". క్రికెట్ అభిమానులకు విజ్ఞప్తి!? ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా… pic.twitter.com/FxQT9joKAl — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 5, 2024
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
16, 17 తేదీల్లో జూనియర్ ఇంటర్లో ప్రవేశానికి కౌన్సెలింగ్
రేపు బాస్కెట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక
వరంగల్ పార్లమెంట్ పరిధిలో 2009 నుంచి 2024 వరకు నమోదైన ఓట్లు, పోలింగ్ శాతం...
పథకాలు పారదర్శకంగా అందించాలి
No Headline
రైతులు ధైర్యంగా ఉండాలి
వరంగల్ స్ట్రాంగ్‌రూంకు ఈవీఎంలు
వాతావరణం
ఓటుకు దూరంగా..
రేవణ్ణ అరెస్ట్ వెనుక కుట్ర: కుమార
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్‌పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
Advertisement