పాకిస్థాన్‌ క్రికెట్‌ను 'అతను' భ్రష్టు పట్టిస్తాడు..!

Published on Mon, 06/27/2022 - 15:51

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్‌ రమీజ్ రాజాపై ఆ జట్టు మాజీ పేసర్ తన్వీర్‌ అహ్మద్‌ (పాక్‌ తరఫున 5 టెస్ట్‌లు, 2 వన్డేలు, ఓ టీ20 ఆడాడు) షాకింగ్ కామెంట్స్ చేశాడు. పీసీబీ అధ్యక్షుడిగా రమీజ్‌ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తైనా చేసిందేమీ లేదని దుయ్యబట్టాడు. నాలుగు దేశాల టీ20 టోర్నీ (భారత్‌, పాక్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌), భారత్‌తో క్రికెట్‌ సంబంధాలు అంటూ హడావుడి చేస్తున్నాడే తప్ప ఈ ఏడాది కాలంలో అతను సాధించింది ఏమీ లేదని పెదవి విరిచాడు. 

రమీజ్‌ పీసీబీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చేసిన ఓ మంచి పనైనా చూపించాలని సవాల్‌ విసిరాడు. పీసీబీ పరిస్థితి గత పాలకుల హయాంలో ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉందని, రమీజ్‌ వచ్చి కొత్తగా పొడిచిందేమీ లేదని విరుచుకుపడ్డాడు. రమీజ్‌ వచ్చే ఏడాది పీసీబీ ప్రణాళికలను వివరిస్తూ ప్రెస్‌మీట్‌ పెట్టిన నేపథ్యంలో తన్వీర్‌ ఈ మేరకు స్పందించాడు. 

రమీజ్‌ మీడియాతో మాట్లాడుతూ.. పీసీబీకి తన హయాం స్వర్ణయుగంలాంటిదని, తాను బాధ్యతలు చేపట్టాక ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేపట్టానని, పాక్‌ క్రికెట్‌ను తాను కొత్త పుంతలు తొక్కించానని గొప్పలు పోయాడు.జట్టు సెలక్షన్ విషయంలో పీసీబీ వ్యవహరిస్తున్న తీరును ఇటీవలే డానిష్ కనేరియా కూడా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, గతంతో పోలిస్తే పాక్‌ ఆటతీరు రమీజ్ హయాంలో కాస్త మెరుగు పడిందనే చెప్పాలి. గతేడాది కాలంలో పాక్‌ ఫార్మాట్లకతీతంగా ఓ మోస్తరు విజయాలు సాధిస్తుంది. 
చదవండి: ఇంగ్లండ్‌ కెప్టెన్‌ సంచలన నిర్ణయం..!

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ