హోల్డర్‌కు రెస్ట్‌.. నెదర్లాండ్స్‌, పాక్‌తో సిరీస్‌కు విండీస్‌ జట్టు ఇదే!

Published on Tue, 05/10/2022 - 15:26

నెదర్లాండ్స్‌, పాకిస్తాన్‌తో పర్యటనల నేపథ్యంలో వెస్టిండీస్‌ తమ క్రికెట్‌ జట్టును ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ల కోసం 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేసింది. ఐసీసీ ప్రపంచకప్‌ సూపర్‌లీగ్‌లో భాగంగా జరుగనున్న ఈ సిరీస్‌లతో పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా నికోలస్‌ పూరన్‌ తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు.

ఇక పూరన్‌ నాయకత్వంలోని ఈ జట్టులో కొత్త ముఖాలు జేడెన్‌ సీల్స్‌, షెర్మోన్‌ లూయిస్‌, కీసీ కార్టీకి చోటు దక్కింది. జేడెన్‌, షెర్మోన్‌ ఫాస్ట్‌ బౌలర్లు కాగా.. కార్టీ బ్యాటర్‌. కాగా మే 31న నెదర్లాండ్స్‌తో విండీస్‌ తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2022లో భాగమైన పూరన్‌, పావెల్‌, రొమారియో షెఫర్డ్‌ తదితరులు లీగ్‌ ముగిసిన వెంటనే జాతీయ జట్టుతో కలవనున్నారు. ఇక లక్నో సూపర్‌జెయింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న జేసన్‌ హోల్డర్‌కి మాత్రం సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.

నెదర్లాండ్స్‌, పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌లకై వెస్టిండీస్‌ 15 మంది సభ్యులతో కూడిన జట్టు:
👉🏾నికోలస్‌ పూరన్‌(కెప్టెన్‌), షాయ్‌ హోప్‌(వైస్‌ కెప్టెన్‌), ఎన్‌క్రుమా బానర్‌, షామర్‌ బ్రూక్స్‌, కేసీ కార్టీ, అకీల్‌ హొసేన్‌, అల్జరీ జోసెఫ్‌, బ్రాండన్‌ కింగ్‌, షెర్మోన్‌ లూయిస్‌, కైల్‌ మేయర్స్‌, అండర్సన్‌ ఫిలిప్‌, రోవ్‌మన్‌ పావెల్‌, జేడెన్‌ సీల్స్‌, రొమారియో షెఫర్డ్‌, హైడెన్‌ వాల్ష్‌ జూనియర్‌.

వెస్టిండీస్‌ నెదర్లాండ్స్‌ టూర్‌ 2022 షెడ్యూల్‌:
👉🏾మే 31- మొదటి వన్డే- వీఆర్‌ఏ క్రికెట్‌ గ్రౌండ్‌- అమ్‌స్టెల్వీన్‌
👉🏾జూన్‌ 2- రెండో వన్డే- వీఆర్‌ఏ క్రికెట్‌ గ్రౌండ్‌- అమ్‌స్టెల్వీన్‌
👉🏾జూన్‌ 4- మూడో వన్డే-వీఆర్‌ఏ క్రికెట్‌ గ్రౌండ్‌- అమ్‌స్టెల్వీన్‌

వెస్టిండీస్‌ పాకిస్తాన్‌ టూర్‌ 2022 షెడ్యూల్‌
👉🏾జూన్‌ 8- మొదటి వన్డే- పిండి స్టేడియం- రావల్పిండి
👉🏾జూన్‌ 10- రెండో వన్డే- పిండి స్టేడియం- రావల్పిండి
👉🏾జూన్‌ 12- మూడో వన్డే- పిండి స్టేడియం- రావల్పిండి

చదవండి👉🏾Jasprit Bumrah: నాకు అవన్నీ తెలుసు.. అయినా నేను అలాంటి వాడిని కాదు: బుమ్రా

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ