సవిత శ్రీ అరుదైన ఘనత.. నిరాశపరిచిన హారిక! ఐదో స్థానంలో అర్జున్‌

Published on Thu, 12/29/2022 - 07:41

FIDE World Rapid Championship- అల్మాటీ (కజకిస్తాన్‌): ‘ఫిడే’ ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో మహిళల ఈవెంట్‌లో భారత్‌కు చెందిన 15 ఏళ్ల టీనేజర్‌ సవిత శ్రీ గ్రాండ్‌మాస్టర్లను ఢీకొట్టి కాంస్య పతకం సాధించింది. విశ్వనాథన్‌ ఆనంద్, కోనేరు హంపి తర్వాత వరల్డ్‌ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన మూడో భారత క్రీడాకారిణిగా సవిత శ్రీ నిలిచింది.  

మహిళా ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ అయిన సవిత ఈ టోర్నీలో 36వ సీడ్‌గా బరిలోకి దిగి మూడో స్థానంలో నిలిచింది. బుధవారం జరిగిన మూడు రౌండ్లలో ఆమె 1.5 పాయింట్లు సాధించింది. దీంతో మొత్తం 8 పాయింట్లతో కాంస్యం గెలుచుకుంది. తొమ్మిదో రౌండ్లో జాన్సయ అబ్దుమలిక్‌ (కజకిస్తాన్‌) చేతిలో ఓడటంతో ఆమె రజత అవకాశానికి గండి పడింది.

నిరాశపరిచిన హారిక
పదో రౌండ్లో క్వియాన్‌యున్‌ (సింగపూర్‌)పై గెలిచిన సవిత... ఆఖరి రౌండ్లో దినార సదుకసొవా (కజకిస్తాన్‌)తో గేమ్‌ను డ్రా చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ సీనియర్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి కూడా 8 పాయింట్లు సాధించినప్పటికీ సూపర్‌ టై బ్రేక్‌ స్కోరు ఆధారంగా ఏపీ అమ్మాయి ఆరో స్థానంలో నిలిచింది. ద్రోణవల్లి హారిక 29వ స్థానంతో నిరాశపరిచింది.

విజేత కార్ల్‌సన్‌
ఓపెన్‌ కేటగిరీలో జరిగిన ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ (9) ఐదో స్థానంలో నిలిచాడు. 8 రౌండ్లలో గెలిచి 3 ఓడిన అర్జున్‌ 2 రౌండ్లు డ్రా చేసుకున్నాడు. ఈ విభాగంలో ఇందులో ప్రపంచ నంబర్‌వన్, చాంపియన్‌ కార్ల్‌సన్‌ (10) విజేతగా నిలిచాడు. భారత సీనియర్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ 77వ స్థానంలో నిలిచాడు.  

చదవండి: IND v SL 2023: విరామం... విశ్రాంతి... వేటు..! 
Ind Vs SL T20 Series: సెంచరీ బాదినా కనబడదా? నువ్వు ఐర్లాండ్‌ వెళ్లి ఆడుకో​! ఇక్కడుంటే..

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ