amp pages | Sakshi

సార్‌.. మా నాన్న తాగొచ్చి అమ్మను కొడుతున్నడు..

Published on Fri, 08/26/2022 - 14:52

సాక్షి, ముస్తాబాద్‌ (సిరిసిల్ల):‘సార్‌ మా నాన్న రోజూ తాగొచ్చి అమ్మను, నన్ను, చెల్లిని కొడుతు­న్నడు.ఎందుకు కొడుతున్నడో ఏమో..’ అమ్మే పనికి పోతది.. మాకు బువ్వ పెడుతది. అమ్మ దగ్గరున్న పైసలు గుంజుకుని రోజూ పొద్దున్నే తాగుతున్నడు.. ఇంటికొచ్చి కొడుతు­న్నడు..’ అంటూ ఎనిమిదేళ్ల బాలుడు పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కా­డు.

రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రానికి చెందిన జంగం భరత్‌ (8) అంబేడ్కర్‌నగర్‌ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతు­న్నాడు. తన తండ్రి తీరుకు విసిగిపోయి గురువారం ఉదయం ఒక్కడే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. బాలుడి ఫిర్యాదుపై స్పందించిన ఎస్‌ఐ భరత్‌ తల్లిదండ్రులు దీపిక, బాలకిషన్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. బాలకిషన్‌కు తెలిసిన డ్రైవింగ్‌ పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకోవాలని కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

బాలకిషన్‌ వేధింపులను భార్య దీపిక కూడా కన్నీటిపర్యంతమవుతూ ఎస్‌ఐకి వివరించింది. పిల్లలను బాగా చదివించాలని, తాము అండగా ఉంటామని ఎస్‌ఐ భరోసా ఇచ్చారు. భరత్‌ను హాస్టల్‌లో చేర్పిస్తాననగా.. తాను గురుకులంలో సీటు సాధిస్తానని.. పోలీస్‌ కావడమే తన లక్ష్యమని చెప్పడం విశేషం. చిన్న వయస్సులోనే సమస్య పరిష్కారానికి వచ్చిన బాలుడిని ఎస్సైతో పాటు అక్కడున్న సిబ్బంది అభినందించారు.
చదవండి: హయత్‌ నగర్‌లో దారుణం.. టీచర్‌ మందలించిందని విద్యార్థిని ఆత్మహత్య

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)