ఈటల రాజేందర్‌తో అమిత్‌ షా చర్చలు

Published on Sat, 09/17/2022 - 14:55

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పరామర్శించారు. శామీర్‌పేట్‌లోని ఈటల నివాసానికి చేరుకున్న అమిత్‌షా ఎమ్మెల్యేను పరామర్శించారు. కాగా ఇటీవల ఈటల రాజేందర్‌ తండ్రి మల్లయ్య మృతిచెందిన విషయం తెలిసిందే.

25 నిమిషాలపాటు చర్చ
శామీర్‌పేట్‌లోని ఈటల రాజేందర్‌ నివాసంలో  అమిత్‌ షా  25 నిమిషాల పాటు ఆయనతో మాట్లాడారు. ఇందులో సుమారు 15 నిమిషాలు ఒంటరిగా ఈటలతో అమిత్‌ షా చర్చించారు. తెలంగాణలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలపై అమిత్‌షా ఆరా తీశారు. 

ప్రధాని పుట్టినరోజు వేడుకల్లో అమిత్‌ షా
అంతకముందు నగరంలోని బాలంరాయి క్లాసిక్ గార్డెన్‌లో జరిగిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదిన వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అమిత్‌ షా.. ఈ సందర్భంగా వికలాంగులు, అంధులకు సైకిల్స్, ఎలక్ట్రానిక్ డివైస్‌లు, మిషన్స్ అందజేశారు.

సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాల్లో రూ. 2 కోట్లతో ఎంపీ ఫండ్స్‌ నుంచి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్మ్షణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, రఘునంధన్ రావు,  విజయశాంతి తదితరులు పాల్గొన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ