పరిమళించిన మానవత్వం..యాచకుడికి ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సపర్యలు 

Published on Sat, 10/30/2021 - 10:41

సాక్షి, షాద్‌నగర్‌: ఆకలితో అలమటిస్తున్న ఓ యాచకుడు రోడ్డు దాటుతూ కిందపడిపోయాడు. వెంటనే ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సాయం అందించి మానవత్వాన్ని చాటాడు. షాద్‌నగర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో పని చేస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మురళీ శుక్రవారం పట్టణంలోని ముఖ్య కూడలిలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో డొక్కలు ఎండిపోయి ఆకలితో అలుమటిస్తూ ఓ యాచకుడు రోడ్డు దాటేందుకు యత్నిస్తూ కింద పడిపోయాడు.
చదవండి: టీఎస్‌ఆర్టీసీ: ప్రభుత్వ పూచీకత్తు లేకుండానే రూ.300 కోట్ల రుణం

గమనించిన కానిస్టేబుల్‌ మురళీ ఆ యాచకుడిని పైకి లేపి పక్కన కూర్చోబెట్టాడు. ఆకలితో ఉన్నానని, కళ్లు తిరుగుతున్నాయని ఆ యాచకుడు సైగలు చేయడంతో వెంటనే కానిస్టేబుల్‌ యాచకుడికి నీళ్లు తాగించి, పక్కనే ఉన్న పండ్లు కొనిచ్చి ఆకలి తీర్చాడు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి ఉన్నతాధికారులకు పంపించారు. మానవత్వాన్ని చాటిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు అభినందించారు. షాద్‌నగర్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐ రఘుకుమార్‌ కానిస్టేబుల్‌ మురళీకి రివార్డు అందజేశారు. తోటి పోలీస్‌ సిబ్బంది అతన్ని అభినందించారు. 
చదవండి: కూకట్‌పల్లిలో వ్యభిచార దందా.. ఓ మహిళను రప్పించి..

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ