కరోనా నిర్ధారణలో వింతలు .. రెండు సార్లు నెగెటివ్‌.. ఓసారి పాజిటివ్‌..

Published on Tue, 04/27/2021 - 07:57

సాక్షి, బోథ్‌(ఆదిలాబాద్‌): మండలానికి చెందిన ఓ మహిళకు మూడుసార్లు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. మొదటిసారి నెగెటివ్, రెండోసారి పాజిటివ్, మూడోసారి నెగెటివ్‌ వచ్చింది. దీంతో ఆ మహిళా కుటుంబసభ్యులు కంగుతిన్నారు. మహిళకు దగ్గు, జలుబు లక్షణాలు ఉండడంతో సొనాల పీహెచ్‌సీలో కరోనా పరీక్ష చేయించుకున్నారు. టెస్టులో నెగెటివ్‌ వచ్చింది. అయినా లక్షణాలు తగ్గకపోవడంతో నిర్మల్‌ ఆసుపత్రిలో పరీక్ష చేసుకోగా పాజిటివ్‌ వచ్చింది.

ఒకసారి నెగెటివ్, మరోసారి పాజిటివ్‌ ఎలా వస్తుందని కుటుంబసభ్యులు మరోసారి కరోనా నిర్ధారణ పరీక్ష చేయించారు. మూడోసారి నెగెటివ్‌ రావడంతో కుటుంబసభ్యులు అయోమయానికి గురవుతున్నారు. ప్రస్తుతం మహిళా హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ