నా ఎదుగుదల సర్వేల్‌ గురుకులం భిక్షే  

Published on Wed, 11/24/2021 - 04:01

సంస్థాన్‌నారాయణపురం: ‘నా ఎదుగుదలకు సర్వేల్‌ గురుకులం చదువే కారణం.. నా జీవితాన్ని మలుపు తిప్పిన గురుకులానికి గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన ఎందరో దేశం గర్వించే స్థాయిలో సేవలందిస్తున్నారు’ అని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.  యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం సర్వేల్‌ గ్రామంలోని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు మంగళవారం నిర్వహించారు.

జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించిన డీజీపీ ఈ సందర్భంగా బాల్య జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. సర్వేల్‌ గురుకులంలో చేరకముందు సొంత ఊరు పక్కన ఉన్న జెడ్పీ హైస్కూల్లో చదివానని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా గురుకులాన్ని ప్రారంభించాలన్న పీవీ నరసింహారావు ఆలోచనలకు స్పందించిన నాటి సర్వోదయ నేత మద్ది నారాయణరెడ్డి తన 50 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారని చెప్పారు. ఇక్కడి నుంచే రాష్ట్రం, దేశ వ్యాప్తంగా గురుకుల విద్యా వ్యవస్థకు బీజం పడిందన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ