వ్యాక్సిన్‌: ఆసుపత్రిలో అంగన్‌వాడీ టీచర్‌

Published on Thu, 01/21/2021 - 14:18

సాక్షి, కరీంనగర్‌ : జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ వికటించి ఒకరు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వాంతులు జ్వరంతో ఇబ్బంది పడుతున్న అంగన్ వాడి టీచర్‌ను హుజురాబాద్ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన అంగన్ వాడి టీచర్ సింగిరెడ్డి సరోజన కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా ఈనెల 19న టీకా తీసుకున్నారు. రాత్రి నుంచి తల తిప్పినట్లుగా వాంతులు చేసుకోవడంతో వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు అప్రమత్తమై అంబులెన్స్‌లో హుజురాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సరోజన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. టీకా తీసుకున్నాక జ్వరంతో పాటు తల తిప్పినట్లై, వాంతులు కావడంతో ఆస్పత్రిలో చేరినట్లు సరోజన తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉందని, ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు తెలిపారు. చదవండి: ఒక్కసారి తిరస్కరిస్తే.. మళ్లీ నో కరోనా వ్యాక్సిన్‌!

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ