అక్టోబర్‌ 24 నుంచి రాష్ట్రంలో రాహుల్‌ పాదయాత్ర

Published on Sat, 09/03/2022 - 07:20

సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడో పాదయాత్ర విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్‌ కోరారు. తెలంగాణలో అక్టోబర్‌ 24న మక్తల్‌ నియోజకవర్గంలో ఈ పాదయాత్ర ప్రారంభమవుతుందని శుక్రవారం ఒక ప్రకట నలో తెలిపారు. 13 నుంచి 15 రోజుల వరకు పాదయాత్ర సాగుతుందని, దీనిపై ఇప్పటికే రూట్‌ పరిశీలన జరిగిందన్నారు.

330 నుంచి 370 కి.మీ. యాత్ర తెలంగాణలో ఉండే అవకాశముందని వెల్లడించారు. దేశంలో ఐక్యత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ కుట్రలను ప్రజలకు వివరించి ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు రాహుల్‌ భారత్‌ జోడో పాదయా త్రను ప్రారంభిస్తున్నారన్నారు. సెప్టెంబర్‌ 7న కన్యాకుమారి నుంచి యాద్ర ప్రారంభం కానుందని బలరాం నాయక్‌ వివరించారు.
చదవండి:ఏడాది పొడవునా తెలంగాణ విలీన వజ్రోత్సవాలు!

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ