ఆప్షన్లు ఇచ్చిన 31వేల మంది

19 Aug, 2014 01:16 IST|Sakshi

హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఆది, సోమవారాల్లో 31,600 మంది విద్యార్థులు తమ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. 1వ ర్యాంకు నుంచి 50 వేల ర్యాంకు వరకు 32,272 మందికి వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించగా సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 31,600 మంది నమోదు చేసుకున్నారు. ఇక సోమవారం 75,001వ ర్యాంకు లక్ష ర్యాంకు వరకు 9,935 మంది విద్యార్థులను సోమవారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలువగా 6,627 మంది హాజరయ్యారు. మొత్తం ఒకటి నుంచి లక్షర్యాంకు వరకు 41,595 మందిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలువగా 29,351 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు.

24న పాలిసెట్ సీట్లు కేటాయింపు,ఆప్షన్ల మార్పునకు అవకాశం

పాలిసెట్ రాసి గతంలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకుని ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులు మళ్లీ తమ ఆప్షన్లను మార్చుకోవచ్చు. గతంలో వెరిఫికేషన్‌కు హాజరై ఆప్షన్లు ఇవ్వని వారు ఇపుడు ఆప్షన్లను ఇవ్వవచ్చు. ఒకటి నుంచి 76 వేల ర్యాంకు వరకు విద్యార్థులు ఈనెల 22న, 76,001వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు విద్యార్థులు ఈనెల 23 సాయంత్రం 5 గంటల వరకు ఆప్షన్ల నమోదు, మార్పులు చేసుకోవచ్చు. ఇక ఈనెల 24న రాత్రి 8 గంటల తరువాత సీట్లు కేటాయిస్తారు. ఆ వివరాలు జ్ట్టిఞట://ఞౌడఛ్ఛ్టి.జీఛి.జీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఇప్పటివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకాని వారిని తరువాతి దశ కౌన్సెలింగ్‌కు అనుమతిస్తారు.

ఈసెట్ ఆప్షన్ల నమోదు, మార్పునకు అవకాశం, 22న సీట్ల కేటాయింపు

ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం ఈసెట్ రాసి గతంలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకొని ఆప్షన్లు ఇచ్చిన  విద్యార్థులు ఇపుడు మళ్లీ ఆప్షన్లు మార్చుకోవచ్చు. గతంలో ఆప్షన్లు ఇవ్వని వారు కూడా ఇపుడు ఆప్షన్లు ఇవ్వవచ్చు. ఒకటి నుంచి చివరి ర్యాంకు వరకున్న విద్యార్థులు ఈనెల 20, 21 తేదీల్లో ఆప్షన్ల నమోదు, మార్పునకు అవకాశం కల్పించినట్టు ప్రవేశాల క్యాంపు ముఖ్యాధికారి రఘునాథ్ తెలిపారు. 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ మార్పులను స్వీకరిస్తామని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు