CWC 2023 IND Vs NZ Semi Final: భారత్‌-న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

14 Nov, 2023 12:57 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరిగే ప్రపంచ కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ను తిలకించేందుకు  ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రాష్ట్రంలోని మూడు నగరాల్లో పెద్ద స్క్రీన్లను (ఫేన్‌ పార్క్‌లను) ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎస్‌.ఆర్‌. గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు.

ఇందులో భాగంగా వైజాగ్‌ ఆర్కే బీచ్‌ వద్ద కాళీ మాత టెంపుల్‌ ఎదురుగా, విజయవాడ ఎంజీ రోడ్డులో ఉన్న ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియం, వైఎస్సార్‌ కడపలోని ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లలో ఒక్కో చోట దాదాపు 10 వేల మంది వీక్షించేలా పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేశామని, ఇందులో ప్రవేశం ఉచితం అన్నారు. క్రికెట్‌ అభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయా ప్రాంతాల్లో ఫుడ్‌ కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.


   

మరిన్ని వార్తలు