‘బీజేపీకి పడిన ఆరు ఓట్లలో పురందేశ్వరి గారి ఓటు ఉందా?’

14 Nov, 2023 12:22 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: కారంచేడు 145వ పోలింగ్ బూత్‌లో బీజేపీకి పడిన 6 ఓట్లలో అసలు పురందేశ్వరి ఓటు ఉందా?’ అంటూ ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ‘‘మీ సొంత బీజేపీ అభ్యర్థికి రాష్ట్ర అధ్యక్షులు ఓటు వేయలేదా?. మీ బావ పక్షాన పక్షపాతివై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీకు కంటగింపు అయిపోయింది. బీజేపీ లాంటి సిద్ధాంతం ఉన్న పార్టీలో సిద్దాంతాలు గాలికి వదిలేసే మీరు ఎన్ని రోజులు ఉంటారు?. గట్టిగా మాట్లాడితే మా ఓటు అక్కడ లేదు.. వైజాగ్‌లోనో రాజంపేటలోనో ఉండిపోయింది అని బొంకుతారు మళ్ళీ!’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

‘‘పురందేశ్వరి గారూ.. మీరు టీడీపీలో ఎన్నాళ్ళు ఉన్నారో.. కాంగ్రెస్‌కు ఎందుకు వెళ్లారో, కాంగ్రెస్ నుంచి ఎందుకు బయటకు వచ్చారో, బీజేపీలో ఎందుకు చేరారో, ఇందులో ఏ ఒక్క ప్రశ్నకీ సమాధానం చెప్పలేకపోయారు. కనీసం బీజేపీలో ఎన్నాళ్ళు ఉంటారన్నదైనా చెప్పగలరా?’’ అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌లో వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

మరిన్ని వార్తలు