27, 30 తేదీల్లో దివ్యదర్శన టోకెన్లు రద్దు

26 Sep, 2017 01:39 IST|Sakshi

గరుడ సేవకు పటిష్ట ఏర్పాట్లు...

తిరుమల జేఈవో శ్రీనివాసరాజు

తిరుపతి (అలిపిరి): శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కాలి నడకన వచ్చే భక్తులకు జారీచేసే దివ్య దర్శన టోకెన్లను ఈనెల 27, 30 తేదీ ల్లో రద్దు చేస్తున్నట్లు తిరుమల జేఈవో కె.ఎస్‌. శ్రీనివాసరాజు తెలిపారు. బ్రహ్మోత్సవాల రోజువారీ సమీక్షలో భాగంగా సోమవారం ఆయన కంట్రోల్‌రూంలో ఉన్నతాధికారులతో సమా వేశం నిర్వహించారు. జేఈవో మాట్లా డుతూ.. ఈనెల 27న గరుడ సేవ, 30న పెరటాసి రెండో శనివారం కావ డంతో దివ్యదర్శనం టోకెన్లు రద్దు చేశామన్నారు.

ఈ విషయం కాలినడక భక్తులకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. గరుడ సేవకు పటిష్ట ఏర్పాట్లుచేస్తున్నామని చెప్పారు. వాహన సేవలు జరిగే సమ యంలో ప్రముఖ వ్యక్తులు మాట్లాడే అంశాలు భక్తులకు స్పష్టంగా వినప డేలా సాంకేతిక అంశాలను సరిచేసుకో వాలని సంబంధిత విభాగాలకు సూచించారు. టీటీడీ సీవీఎస్‌వో ఆకే రవికృష్ణ మాట్లాడుతూ, గరుడ సేవ రోజున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. 

మరిన్ని వార్తలు