నడవలేకున్నా.. పరీక్షలు రాస్తా....

27 Mar, 2015 08:25 IST|Sakshi

లేపాక్షి: పట్టుదల ముందు ఎటువంటి ఆటంకాలు, అవరోధాలైనా తలవంచాల్సిందేనని అనంతపురం జిల్లాకు చెందిన ఓ బాలిక నిరూపించింది. నడవలేని స్థితిలో ఉన్నా...  విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినా... విద్యా సంవత్సరాన్ని కోల్పోరాదనే ఉద్దేశంతో పరీక్షలకు హాజరవుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కల్లూరు గ్రామానికి చెందిన శ్రావణి పదో తరగతి చదువుతోంది.
 
 ఆరు నెలల సైకిల్‌పై పాఠశాలకు వెళుతూ కిందపడడంతో కాలు విరిగింది. వైద్యులు శస్త్రచికిత్స చేసి కాలి లోపల స్టీల్ రాడ్ వేశారు. అయితే, దురదష్టవశాత్తూ శ్రావణి మరోసారి కిందపడడంతో రెండోసారీ శస్త్రచికిత్స చేసిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. కానీ, ఎంత కష్టమైనా సరే పదో తరగతి వార్షిక పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్న శ్రావణి... తండ్రి సహాయంతో లేపాక్షిలోని వివేకానంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్షలు రాస్తోంది.  
 
 
 
 

మరిన్ని వార్తలు