'రాజధాని పేరుతో హైప్ క్రియేట్ చేయడం సరికాదు'

23 Nov, 2014 13:29 IST|Sakshi
'రాజధాని పేరుతో హైప్ క్రియేట్ చేయడం సరికాదు'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశానికి సంబంధించి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తులసిరెడ్డి స్పష్టం చేశారు.  ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసమీకరణపై బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన తులసిరెడ్డి.. కేంద్రానికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. రాజధాని భూసేకరణ అనేది ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని ఆయన స్పష్టం చేశారు.

 

ముందు రైతులు, రైతు కూలీలు గురించి ఆలోచించాలని.. రాజధాని పేరుతో ఏదో హైప్ క్రియేడ్ చేయడం సరికాదన్నారు. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉందని.. ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదని తులసిరెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు