జూన్ 2న ఏపీ అవతరణ దినోత్సవం

30 Oct, 2014 16:20 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జూన్ 2న జరపాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని కోసం భూసేకరణపై ప్రధానంగా చర్చ జరిగింది. 60:40 నిష్పత్తిలో భూసమీకరణ చేపట్టాలన్న వచ్చిన ప్రతిపాదనపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. అవసరమైన మేరకు ఉద్యోగ బదిలీలు చేసేందుకు మంత్రులకు సీఎం చంద్రబాబు స్వేచ్ఛ నిచ్చారు.

కేబినెట్ నిర్ణయాలు
కేంద్రం నుంచి అదనపు తుపాను సహాయం కోసం అభ్యర్థన
న్యాయసలహాకు డీఆర్ డీఏ ఏర్పాటు ఫైల్
ఏపీ డ్రైవర్లకు రూ. 5 లక్షల వరకు బీమా కల్పన
శనగ పంట క్వింటా రూ. 3100లకు కొనుగోలు
ధరల నియంత్రణకు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీతలతో కమిటీ ఏర్పాటు
నవంబర్ 2న ఎర్రన్నాయుడు వర్థంతి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహణ

మరిన్ని వార్తలు