తప్పుడు వార్తలపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌

20 Jun, 2020 16:58 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు కథనాలు ప్రచురించిన వార్తా పత్రికలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆమోద పబ్లికేషన్స్‌, ఉషోదయా పబ్లికేషన్స్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర భూగర్భగనుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ శనివారం మీడియా మాట్లాడారు.

మైనింగ్‌పై అసత్య ఆరోపణలు చేసినవారిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉందని అన్నారు. ఆయా సంస్థలు, వ్యక్తులు 15 రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో పరువునష్టం దావా వేస్తామని ద్విదేదీ స్పష్టం చేశారు. తప్పుడు కథనాలకు సంబంధించి ఆయా పత్రికలు స్పందించిన తీరు సంతృప్తికరంగా లేనందునే మీడియా ముందుకు వచ్చినట్టు ఆయన చెప్పారు.
(చదవండి: టమాటో ఛాలెంజ్‌తో రైతులకు ఊరట)

మరిన్ని వార్తలు