సీఎం సహాయ నిధికి తూట్లు!

23 Aug, 2014 03:47 IST|Sakshi

* పేదలకు ముఖ్యమంత్రి పేషీలోనే చెక్‌లు ఇచ్చేందుకు రంగం సిద్ధం
* తెలుగుదేశం పార్టీ వర్గాలకు ఇష్టానుసారం మంజూరే లక్ష్యం!
* వైద్య, రెవెన్యూ శాఖల స్క్రూటినీకి మంగళం
* రెవెన్యూ, ఆర్థిక శాఖల మంత్రుల వ్యతిరేకత
* ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సిద్ధమైన ఫైలు
* గతంలో చంద్రబాబు పేషీలోనే సీఎం సహాయ నిధి కుంభకోణం

 
సాక్షి, హైదరాబాద్:  ముఖ్యమంత్రి సహాయ నిధికి తూట్లు పొడిచేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయమే ఇందుకు పూనుకోవడం విడ్డూరం. ఆర్థిక స్థోమత లేని వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆసుపత్రి బిల్లు అంచనా ఆధారంగా లేదా ఆసుపత్రికి చెల్లించిన బిల్లుల ఆధారంగా సీఎం సహాయ నిధి నుంచి నిధులను మంజూరు చేస్తుంటారు. ఈ నిధి రెవెన్యూ శాఖ ఆధ్వర్వంలో ఉంటుంది. రెవెన్యూ శాఖతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఇలాంటి సహాయూనికి సంబంధించిన అన్ని అంశాలూ పరిశీలిస్తారుు.
 
 అంతా సవ్యంగా ఉంటే రెవెన్యూ శాఖ సంబంధిత రోగి లేదా ఆసుపత్రికి చెక్‌లను ఇస్తుంది. అయితే ఇప్పుడు.. గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయంలోనే చెక్‌లను మంజూరు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఫైలును సిద్ధం చేశారు. తొలుత రూ.5 లక్షలు, అవి ఖర్చరుున తర్వాత మరో రూ.5 లక్షలు ఇలా ముఖ్యమంత్రి కార్యాలయానికి నిధులు బదిలీ చేస్తుండాలని ఫైలులో పేర్కొన్నట్లు ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. ఈ విధంగా బదిలీ చేసిన నిధుల నుంచి ముఖ్యమంత్రితో పాటు ఆయన కార్యాలయ అధికారులు తమకు నచ్చిన వారికి మంజూరు చేస్తూ నేరుగా సీఎం కార్యాలయమే చెక్‌లను ఇచ్చేస్తుందన్నమాట. ఈ ప్రతిపాదనను ఆర్ధిక, రెవె న్యూ శాఖల మంత్రులు తీవ్రంగా వ్యతిరేకించి నట్లు సమాచారం. గతంలో ఏ ముఖ్యమంత్రు లు ఈ విధంగా చేయలేదని, ప్రభుత్వ నిధులను ఎటువంటి స్క్రూృటినీ లేకుండా సీఎం సహాయ నిధికి బదలారుుంచలేదని వారు పేర్కొన్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేయాలని భావించినా.. గతంలో అనుసరించిన విధానాన్నే అనుసరించాలి తప్ప ఇలా ముఖ్యమంత్రి కార్యాలయమే నేరుగా చెక్‌లను మంజూరు చేయడం సరికాదని ఆ మంత్రులు అభిప్రాయపడినట్లు తెలిసింది.
 
  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పార్టీలకు అతీతంగా.. పేదల వైద్య చికిత్సలకు గాను సీఎం సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేశారని, ఒక దశ లో అప్పటి ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసుల మేరకే ఎక్కువ మొత్తంలో నిధులు ఇచ్చారని వెల్లడించా రుు. సీఎం కార్యాలయానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన చెక్‌లు ఇచ్చే అధికారం కట్టపెట్టడం అంటే పరోక్షంగా నిధుల దుర్వినియోగానికి, కుంభకోణాలకు ఆస్కారం కల్పించినట్టేననే ఆందోళన వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు