జాతీయ విద్యా దినోత్సవం: మౌలానా ఆజాద్ జ‌యంతి వేడుకలకు సీఎం జగన్‌

10 Nov, 2023 18:07 IST|Sakshi

సాక్షి, ఎన్టీఆర్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(శనివారం) విజయవాడకు రానున్నారు. స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి.. భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ 135వ జయంతి ఉత్సవాల్లో సీఎం జగన్‌ పాల్గొనున్నారు. 

నగరంలోని విజయవాడ మున్సిపల్‌ స్టేడియంలో మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి ఉత్సవాలు జరగనుండగా.. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. డిప్యూటీ సీఎం అంజాద్ భాషా,ఎమ్మెల్సీలు తలశిల రఘురాం,రుహుల్లా,ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్, సబ్ కలెక్టర్ అదితిసింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

ఏటా నవంబర్‌ 11వ తేదీని.. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతిని దేశం మొత్తం జాతీయ విద్యా దినంగా, మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా ఘనంగా నిర్వహిస్తుంటారు.

మరిన్ని వార్తలు