వారికి 4 కళ్యాణ మండపాల్లో వసతి ఏర్పాట్లు

2 May, 2020 20:21 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: గుజరాత్‌కు వలస వెళ్లిన 381 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్సకారులు శనివారం విశాఖకు చేరుకున్నారు. కాగా వీరందరూ ప్రత్యేక బస్సులలో ఏపీకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరి కోసం జిల్లాలోని నాలుగు మండపాలలో వసతి సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. అంతేగాక అక్కడే వారందరికి భోజన సదుపాయాలు కూడా కల్పించనున్నారు. అదే విధంగా మత్స్య కారులకు మాస్క్‌ల పంపిణీతో పాటు థర్మల్‌ స్ర్కీనింగ్‌ కూడా చేయిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. (‘టీవీ షూటింగ్స్‌కు‌ అనుమతివ్వండి’)

ఇక ప్రతీ కళ్యాణ మండపం వద్ద ఒక్కొక్క తహసిల్ధార్‌కు బాధ్యత ఇచ్చినట్లు తెలిపారు. మత్స్య కారులందరికీ ఆధార్ ఐడి నంబర్‌ ‌ఆధారంగా శాంపిల్స్‌ సేకంచి కోవిడ్‌-19 పరీక్షలు చేయించనున్నారు. కాగా ఆదివారం మధ్యాహ్నం వరకు వైద్య పరీక్షల వివరాలు వచ్చే అవకాశం ఉందని, వారిలో ‍కరోనా నెగిటివ్‌ వచ్చిన మత్స్యకారులను ఇంటికి పంపించి 14 రోజుల పాటు సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉండాలని సూచించననున్నట్లు అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు