ఉద్యమాలతో చంద్రబాబు గుండెల్లో దడ

15 Apr, 2018 11:48 IST|Sakshi
తిరుపతిలో ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్‌ సీపీ, వామపక్షాలు, జనసేన నేతలు

5 కోట్ల మంది సంక్షేమం కోసం రాజకీయాలకతీతంగా పోరాడుదాం

రేపటి రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేద్దాం..

బైక్‌ ర్యాలీలో అఖిలపక్ష నేతలు

తిరుపతి మంగళం  : ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడం కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో పాటు వామపక్షాలు, జనసేనపార్టీలు చేస్తున్న ఉద్యమాలతో చంద్రబాబు గుండెల్లో దడ పుట్టిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతి కార్పొరేషన్‌ కార్యాలయం నుంచి వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సిపిఐ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వందల బైకు లతో నాలుగుకాళ్ల మండపం, కర్నాలవీధి, భేరివీధి, టౌన్‌క్లబ్, బాలాజికాలనీ, గాంధీరోడ్డు మీదగా తుడా సర్కిల్‌ వర కు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కరుణాకరరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీతో ఇతర రాజకీయపార్టీలన్నీ జతకట్టి ఉద్యమాలు తీవ్రతరం చేయడంతో చంద్రబాబు గుండెల్లో దడ పుట్టి తాను ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తానంటూ డ్రామాలు ఆడడం మొదలు పెట్టాడని మండిపడ్డారు. 16వతేదీన రాష్ట్ర బంద్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. బంద్‌ ను అడ్డుకునేందుకు చంద్రబాబు పోలీ సులతో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే చరిత్రలో ప్రజాద్రోహిగా నిలిచిపోతాడన్నారు.

సీపీఎం నాయకులు కుమార్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి పుల్లయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, జనసేన నాయకులు కిరణ్‌రాయల్‌ మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ యువ నాయకులు భూమన అభినయ్, నాయకులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, ఎస్‌కే.బాబు, ఎస్‌కే.ఇమామ్, జ్యోతిప్రకాష్, రాజేంద్ర, కట్టా గోపీయాదవ్, ఆదికేశవులురెడ్డి, బాలిశెట్టి కిషోర్, మా ర్కెట్‌ వంశీ, తాలూరి ప్రసాద్, నరేంద్రనాథ్, పాముల రమేష్‌రెడ్డి, దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి, జాఫర్, చాంద్‌బాషా, మాధవనాయుడు, పుష్పాచౌదరి, రమణమ్మ, శ్యామల, పుణీత, సీపీఐ నేతలు పెంచలయ్య, రాధాకృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ నేత జయచంద్ర పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు