ఏపీ టెన్త్‌ ఫలితాలు విడుదల

14 May, 2019 11:00 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి ఈ ఫలితాలను విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ మూడో తేదీ వరకు 2,839 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,21,634మంది విద్యార్థులు పదోతరగతి చదవగా వీరిలో 99.5 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 94.88 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు (95.09), బాలుర(94.68)పై పైచేయి సాధించారు. తూర్పు గోదావరి జిల్లా (98.19) టాప్‌లో నిలువగా నెల్లూరు (83.19) జిల్లా చివరిస్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,690 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 5,464 పాఠశాలల విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. మూడు పాఠశాలల్లో సున్నాశాతం ఫలితాలు నమోదయ్యాయి. జీపీఏ 10 పాయింట్లతో 33,972 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జూన్‌ 17 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

పదో తరగతి పరీక్ష ఫలితాలను కింది వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు...
 https://www.sakshieducation.com 

వీడియో: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

మరిన్ని వార్తలు