ప్రభుత్వం కోరితే మధ్యవర్తిత్వానికి సిద్ధం: గద్దర్

25 Oct, 2014 00:38 IST|Sakshi
ప్రభుత్వం కోరితే మధ్యవర్తిత్వానికి సిద్ధం: గద్దర్

గజ్వేల్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తలెత్తిన విద్యుత్ వివాదం విషయంలో.. ఇక్కడి ప్రభుత్వం కోరితే మధ్యవర్తిత్వం వహించి సమస్య పరిష్కారానికి తనవంతు ప్రయత్నం చే స్తానని ప్రజాగాయకుడు గద్దర్ ప్రకటించారు. మెదక్ జిల్లా గజ్వేల్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్నదమ్ముల్లా కలసి ఉండాల్సిన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ వ్యవహారం ఉద్రిక్తతలను సృష్టించడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

కరెంట్ కోతల కారణంగా తెలంగాణ రైతాంగం అల్లాడుతోందని, ఈ సమస్య నుంచి రైతులను గట్టెక్కించడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనవంతు తోడ్పాటు ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు సాగించాల్సిన ప్రస్తుత తరుణంలో రెండు రాష్ట్రాల మధ్య సోదరభావం ఎంతో అవసరమన్నారు. సాగునీటి వనరుల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం ముందుకు కదలడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
 
 
 

మరిన్ని వార్తలు