వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలనకు చర్యలు

22 May, 2015 03:22 IST|Sakshi

 కలెక్టర్ జానకి
 నెల్లూరు(రెవెన్యూ) : జిల్లాలో వెట్టిచాకిరీ వ్యవస్థను నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.జానకి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో 53 మందికి వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించినట్లు తెలిపారు. విముక్తి పొందిన వారికి రేషన్ కార్డుల ఉపాధి, పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నివాసస్థలాలు మంజూరు చేసి పక్కాగృహాలు నిర్మించాలన్నారు. కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, డీఆర్‌డీఏ, డ్వామా పీడీలు చంద్రమౌళి, వెంకటసుబ్బయ్య, హౌసింగ్ పీడీ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

 పరిశ్రమల స్థాపనకు మౌలిక వసతులు
 పరిశ్రమల స్థాపనకు మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ ఎం.జానకి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చిన వారిని ప్రోత్సహించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు నిబంధనల ప్రకారం భూములు కేటాయించాలని సూచించారు. భూములు కోల్పోయిన వారికి సకాలంలో నష్టపరిహారం మంజూరు చేయాలన్నారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశ్రమల శాఖ జీఎం సుధాకర్‌రావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ వి.నాగేశ్వరరావు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు