‘బాబుకు రోజులు దగ్గరపడ్డాయ్’

28 Feb, 2016 04:06 IST|Sakshi
‘బాబుకు రోజులు దగ్గరపడ్డాయ్’

 తాడిపత్రి టౌన్ : రాజకీయాల్లో నైతిక విలువలు మరచిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడకు రోజులు దగ్గరపడ్డాయని వైఎ స్సార్ సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన  విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఎ న్ని కల హామీలు అమలు చేయడంలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. హామీల విషయంపై ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిల దీయడం, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో బాబుకు దిక్కుతోచడం లేదన్నారు. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు తాయిలాలు, పదవుల ఆశలు చూపి టీడీపీలోకి చేర్చుకుంటున్నారని మండిపడ్డారు.

వైఎస్ జగన్ లక్ష్యంగానే ‘రూ.500 కోట్లతో బాబు ఆకర్ష్’ పెట్టారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు నీచరాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలే గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఎ వరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వ చ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని జోస్యం దీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షం లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి తనయుడు లోకేశ్ ప్రకటించడాన్ని చూస్తే అతనికి రాజకీయాల్లో కనీస పరిజ్ఞానం లేదనే విషయం అర్థమవుతోందన్నారు. ప్రజాస్వామ్య వ్య వస్థకు చంద్రబాబు మచ్చ తెచ్చారని పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగిరెడ్డి విమర్శిం చారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు ముష్కిన్, తాడిపత్రి పట్టణ కన్వీనర్ కంచెం రామ్మోహన్‌రెడ్డి, సేవాదళ్ పట్టణ శాఖ అధ్యక్షుడు సంపత్, పట్టణ మాజీ కన్వీనర్ సలాం, బీసీ విభాగం పట్టణ శాఖ కన్వీనర్ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు