అతను వైఎస్సార్‌సీపీ నాయకుడే!

4 Mar, 2020 09:54 IST|Sakshi
లోకేష్, చంద్రబాబులతో బిర్రు ప్రతాప్‌రెడ్డి (ఫైల్‌)

బిర్రుపై మీడియా సమావేశంలో చంద్రబాబు

సాక్షి, అమరావతి: తమ పార్టీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి పనిచేసే వారంతా టీడీపీ వాళ్లు కాదని.. బిర్రు ప్రతాప్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ నాయకుడేనని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు. మంగళవారం ఆయన మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రతాప్‌రెడ్డితో కేసు వేయించి కావాలనే ఎన్నికలు ఆలస్యం చేశారని ఆరోపించారు. హైకోర్టు ఒక నెల సమయమిచ్చినా బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లడంలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. (సోమిరెడ్డి కూడా వైఎస్సార్‌సీపీయేనా..?)

50 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. దీనిపై పోరాడతామని, సుప్రీంకోర్టుకు వెళ్లే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. 50 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే 16 వేల మంది బీసీలకు పదవులు పోతాయన్నారు. తమకు కేంద్రం నుంచి డబ్బులు రావాల్సి ఉన్నందునే.. 50 శాతం రిజర్వేషన్లతో ముందుకు వెళుతున్నామని అధికార పార్టీ చెప్పడం సరికాదన్నారు. దీనివల్ల జరిగే నష్టానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు.  (చదవండి: చంద్రబాబు వల్లే సీట్ల కోత)

చంద్రబాబు బీసీల వ్యతిరేకి
టీడీపీ అధినేత చంద్రబాబు బీసీల వ్యతిరేకి అని మరోమారు రుజువైంది. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎక్కడ ప్రాధాన్యత లభిస్తుందోననే భయంతో చంద్రబాబు కుట్రలకు తెరతీశారు. ఆయన నైజం తెలుసుకున్న బీసీలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.
– రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి

మరిన్ని వార్తలు