అమల్లోకి ఏపీ భూ హక్కుల చట్టం

15 Nov, 2023 06:32 IST|Sakshi

దేశంలోనే మొదటిసారి చట్టాన్ని తెచ్చిన ఏపీ ప్రభుత్వం

సాక్షి, అమరావతి: దేశంలోనే మొట్ట మొదటిసారిగా రాష్ట్రంలో భూ హక్కుల చట్టం (ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌) అమల్లోకి వచ్చింది. ఏపీ ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం 2023ని ఈ సంవత్సరం అక్టోబర్‌ 31 నుంచి అమల్లోకి తెస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్‌ 512 జారీ చేసింది. దాని గెజిట్‌ నోటిఫికేషన్‌ మంగళవారం విడుదలైంది. ఇటీవలే ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో ప్రభుత్వం అమ ల్లోకి తీసుకువచ్చింది.

భూ యజమానులు, కొను గోలుదారులకు భూమి హక్కులపై పూర్తి భరోసా ఇచ్చేలా ఈ చట్టాన్ని రూపొందించారు. ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి చట్టం లేదు. భూ హ క్కుల చట్టం ప్రకారం స్థిరాస్థి హక్కుల రిజిస్టర్‌ త యారు చేస్తారు. స్థిరాస్థిని యజమాని తప్ప వేరే ఎవరూ విక్రయించే అవకాశం ఉండదు. రాష్ట్రంలోని మొత్తం స్థిరాస్థుల శాశ్వత రిజిస్టర్, వివాద రిజిష్టర్‌ తో పాటు కొనుగోలు రిజిస్టర్‌ రూపొందిస్తారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులను సవరిస్తారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి నేతృత్వంలో ఏపీ ల్యాండ్‌ అథారిటీని ఏర్పాటు చేస్తారు.

ఆ అధికారి కింద మండల స్థాయిలో లాండ్‌ టైట్లింగ్‌ అధికారులను నియమిస్తారు. భూమి హక్కులను రిజిస్టర్‌ చేసే బాధ్యత ల్యాండ్‌ టైట్లింగ్‌ అధికారికే ఉంటుంది. పలు దశల తర్వాత టైట్లింగ్‌ అధికారి భూముల యజమానులను శాశ్వత హక్కుదారులు గా గుర్తించి రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. వీటిపై ఎవరూ కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ ట్రిబ్యు నళ్లలో తేల్చుకోవడం తప్ప కోర్టుకు వెళ్లడానికి అవ కాశం ఉండదు. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్‌ తీర్పు లపై నే హైకోర్టులో సవాల్‌ చేసే అవకాశం ఉంటుంది. 

మరిన్ని వార్తలు