Nov 15th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

15 Nov, 2023 19:14 IST|Sakshi

టీడీపీ ఖాతాలోకి రూ.27 కోట్ల స్కిల్‌ స్కామ్‌ నిధులు

హవాలా మార్గంలో చేరినట్టు గుర్తించిన సీఐడీ

ఇతర కుంభకోణాల నిధులు కూడా చంద్రబాబు పార్టీ ఖాతాలోకే

ఈ నిధుల గుట్టు రట్టు చేసేందుకు విచారణ వేగవంతం

చంద్రబాబుకు ముంచుకొస్తున్న జైలు ముహూర్తం

రాజకీయ చర్చలతో బిజీ బిజీగా చంద్రబాబు

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు సర్వ ప్రయత్నాలు

సామాజిక వర్గం, టీటీడీపీ నేతలతో నిరంతరాయంగా చర్చలు

కేసుల రూపంలో వెంటాడుతున్న తప్పులు, అక్రమాలు

వరుస పిటిషన్లతో కోర్టులపై ఒత్తిడి తెచ్చే కుట్ర

Chandrababu Naidu Cases, Petitions, & Political Updates

5:36 PM, Nov 15, 2023
తెలంగాణకు దారేది?
►తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కనిపించని పవన్ కల్యాణ్
►పవన్ కోసం జనసేన అభ్యర్థులతో పాటు బీజేపీ ఎదురుచూపులు
►తెలంగాణలో 111 చోట్ల బీజేపీ, 8 చోట్ల జనసేన అభ్యర్థులు
►ఇప్పటిదాకా ప్రచారానికి రాని పవన్ కల్యాణ్
►ప్రధాని మీటింగ్‌ తర్వాత ముఖం చాటేసిన పవన్‌
►అసలు పవన్ కల్యాణ్ వస్తాడా? రాడా? అన్నదానిపై కొనసాగుతున్న సస్పెన్స్
►అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కనిపించని పవన్‌ కళ్యాణ్‌
►పార్ట్‌టైం పాలిటిక్స్‌కు పవన్‌ పరిమితమయ్యాడని జనసేనను నమ్ముకున్నవారి ఆవేదన
►ఈ నెల 17, 18 తేదీల్లో తెలంగాణ ఎన్నికల ప్రచారానికి రానున్న హోంమంత్రి అమిత్ షా
►కనీసం అమిత్‌షా పర్యటన సందర్భంగానైనా పవన్‌ కనిపిస్తాడని ఆశలు

5:20 PM, Nov 15, 2023
జైలు ముహూర్తం దగ్గరపడుతుండడంతో చంద్రబాబు టీంలో ఆందోళన
►నవంబర్‌ 28న రాజమండ్రి జైల్లో లొంగిపోవాల్సి ఉన్న చంద్రబాబు
►ఇప్పటికే కంటి ఆపరేషన్‌ పేరిట మధ్యంతర బెయిల్‌ తీసుకున్న చంద్రబాబు
►తాజాగా గుండె జబ్బు గురించి హైకోర్టుకు నివేదించిన చంద్రబాబు లాయర్లు
►నవంబర్‌ 28న జైలులోనికి వెళ్లకుండా ఉండేందుకు సర్వ ప్రయత్నాలు
►ఆరోగ్య పరిస్థితిని కారణంగా చూపి కోర్టు నుంచి మినహాయింపు పొందే వ్యూహాలు
►ఎన్నో బహిరంగ సభల్లో తన ఆరోగ్యం గురించి మాట్లాడిన చంద్రబాబు
►వయస్సు అనేది తనకొక నెంబర్‌ మాత్రమేనని ప్రకటించిన చంద్రబాబు
►40 ఏళ్ల కుర్రాళ్ల కంటే వేగంగా పనులు చేస్తానని ఎన్నో సార్లు చెప్పుకున్న చంద్రబాబు
►జైలుకు వెళ్లగానే చంద్రబాబుకు హఠాత్తుగా గుర్తుకొచ్చిన జబ్బులు

4:45 PM, Nov 15, 2023
చంద్రబాబుకు గుండె జబ్బు
►చంద్రబాబు బెయిల్ పిటిషన్ సందర్భంగా హైకోర్టుకు డాక్టర్ల నివేదిక సమర్పించిన టిడిపి లాయర్లు
►చంద్రబాబు గుండె పరిణామం పెరిగింది : టిడిపి లాయర్లు
►చంద్రబాబు గుండెలో బ్లాక్స్ ఉండడం వల్ల గుండెకు రక్త ప్రసరణ తక్కువగా ఉంది
►చంద్రబాబు గుండె వాల్వ్ లలో ఇబ్బందులు ఉన్నాయి : టిడిపి లాయర్లు
►చంద్రబాబుకు హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది : టిడిపి లాయర్లు
►చంద్రబాబు శరీరంలో ఉండాల్సిన దాని కంటే కాల్షియం శాతం అధికంగా ఉంది : టిడిపి లాయర్లు
►ఇటీవల చంద్రబాబు గుండెజబ్బు గురించి మాట్లాడిన కొడుకు లోకేష్‌
►చంద్రబాబుకు పుట్టినప్పటి నుంచే గుండెలో రంధ్రాలున్నాయని తెలిపిన లోకేష్‌

3:45 PM, Nov 15, 2023
స్కిల్‌ స్కాం@హైకోర్టు
►చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై వాదనలు వాయిదా
►తదుపరి విచారణ రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా
►ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ

3:20 PM, Nov 15, 2023
మనకెందుకు పొత్తు.? : భగ్గుమన్న జనసేన నేతలు
►అనకాపల్లి జనసేన లో రెండు వర్గాల మధ్య విభేదాలు
►టీడీపీతో సమన్వయ కమిటీ సమావేశంలో రెండుగా వీడిన జనసేన నేతలు
►మనకెందుకు పొత్తు అంటూ తీవ్రంగా మండిపడ్డ ఒక వర్గం
►ఇన్నాళ్లు పడ్డ శ్రమ బూడిదలో పోసినట్టయిందంటూ ఆవేదన
►జనసేన నేతలు భాస్కర్ రావు, గోపి వర్గాల మధ్య తోపులాట

3:15 PM, Nov 15, 2023
స్కిల్‌ స్కాం@హైకోర్టు
►చంద్రబాబు కంటి ఆపరేషన్, హెల్త్ కండిషన్ వివరాలు హైకోర్టుకు ఇచ్చిన టిడిపి లాయర్లు
►వైద్యుల సూచనల నివేదికను మెమో ద్వారా కోర్టుకు ఇచ్చిన లాయర్లు
టిడిపి లాయర్లు : కుడి కంటికి శస్త్రచికిత్స నిర్వహించినట్లు వైద్యుల నివేదిక
టిడిపి లాయర్లు : అనారోగ్య సమస్యల నుంచి కోలుకునేందుకు మందులు వాడాలని వైద్యుల సూచన
టిడిపి లాయర్లు : ఐదు వారాలపాటు కంటి చెకప్ కోసం షెడ్యూల్ ఇచ్చిన వైద్యులు
టిడిపి లాయర్లు : ఆపరేషన్ చేసిన కంటికి ఐదు వారాలు ఇన్‌ట్రా ఆక్యులర్ ప్రెజర్ చెక్ చేసుకోవాలన్న వైద్యులు
టిడిపి లాయర్లు : ఐదు వారాలు కంట్లో చుక్కల మందులు వేసుకోవాలని వైద్యుల సూచన

3:12 PM, Nov 15, 2023
స్కిల్‌ స్కాం@హైకోర్టు
►స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ
►సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు
►అదనపు అఫిడవిట్ దాఖలు చేసిన సీఐడీ తరఫు న్యాయవాది
►చంద్రబాబు కంటి శస్త్రచికిత్స వైద్య నివేదిక కోర్టుకు అందజేత
►వైద్య నివేదికను హైకోర్టుకు అందజేసిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు

3:02 PM, Nov 15, 2023
స్కిల్‌ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది?
►టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్‌ స్కాం
►నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం
►జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్‌తో ఒప్పందం అంటూ ప్రచారం
►సీమెన్స్‌ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రచారం
►ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు
►అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు
►షెల్ కంపెనీల ద్వారా  రూ 241 కోట్ల పక్కదారి
►విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్‌
►పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్)
►ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST
►విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు
►స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ
►నిధులన్నీ సూట్‌కేస్‌ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్‌కమ్‌టాక్స్‌ శాఖ
►కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్‌మెంట్లను గుర్తించిన CID
►రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి
►ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్
►చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్‌ విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు
►సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ
►1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్‌ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్‌ చేసిన సీఐడీ పోలీసులు
►సెప్టెంబర్‌ 10న రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలింపు
►ఐదు పర్యాయాలు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగింపు
►రిమాండ్‌ ఖైదీగా 7691 నెంబర్‌తో 52 రోజులపాటు చంద్రబాబు
►కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్‌ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. 

(ఇదీ చదవండి:  స్కిల్‌ స్కాం.. అంతా బాబుగారి కనికట్టు)

2:50 PM, Nov 15, 2023
బాబు తప్పు చేశారు.. ఇవీ ఆధారాలు : CID
►ఏపీ హైకోర్టు: CID అదనపు కౌంటర్‌ దాఖలు
►స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు బెయిల్ పిటిషన్ కు సంబంధించి అదనపు కౌంటర్
►కౌంటర్లో పలు కీలకమైన జడ్జిమెంట్లు ఉదాహరించిన సిఐడి

2:44 PM, Nov 15, 2023
తెలుగుదేశం పాలనలో జరిగింది మోసం : మల్లాది విష్ణు
►విజయవాడ : 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రజలను దగా చేసింది.
►టీడీపీ ఓట్లను ఎక్కడ తొలగించారో చర్చకి రావాలి.
►సిటీజన్స్ ఫర్ డెమోక్రసీ కాదు.. తెలుగుదేశం పార్టీ బీ టీం
►మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబుకు భజన టీంని ఏర్పాటు చేశాడు
►స్కిల్ డెవలప్మెంట్ కేసులో రూ. 27 కోట్లు చంద్రబాబు ఎలా దారి మళ్ళించాడో నిమ్మగడ్డ రమేష్ చెప్పాలి.
►నిన్న గుంటూరులో సమావేశమైంది చంద్రబాబు తొత్తులు.
►చంద్రబాబు అరెస్టు చట్ట ప్రకారం జరిగింది.
►యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా ఎలా పనిచేసాడో అర్థం కావట్లేదు
►యనమల రామకృష్ణుడు మతిపోయి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు.
►లోకేష్ కి ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడే అర్హత లేదు.
►ఆరోగ్యశ్రీ వ్యవస్థని టిడిపి ప్రభుత్వంలో నిర్వీర్యం చేశారు.
►వైయస్సార్ ఆరోగ్య శ్రీ ని చంద్రబాబు దుర్భుద్ధితో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా మార్చారు.
►కరోనా టైంలో నువ్వు నీ బాబు హైదరాబాదులో దాక్కున్నారు.
►నిమ్మగడ్డ రమేష్, యనమల రామకృష్ణుడు, లోకేష్ అబద్ధాల ప్రచార కోరుగా మారారు

2:25 PM, Nov 15, 2023
కాచుకుంటారా ఓపెన్‌ ఛాలెంజ్‌ : వెల్లంపల్లి
►చంద్రబాబు,పవన్,లోకేష్ లకు  వెలంపల్లి ఓపెన్ ఛాలెంజ్
►చంద్రబాబు,లోకేష్,పవన్ కళ్యాణ్ కి దమ్ముంటే పులివెందులలో పోటీ చేయాలి
►పోటీ చేసేందుకు నియోజకవర్గమే లేని వ్యక్తి పవన్ కళ్యాణ్
►నాదెండ్ల మనోహర్ కు కళ్ళు మందగించినట్టు ఉన్నాయి
►సామాన్యుడికి మంచి జరుగుతుంటే పవన్ కళ్యాణ్ చూసి ఓర్వలేక పోతున్నారు
►వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతీ పిల్లాడికి అమ్మ ఒడి ఇస్తున్నాం
►టీడీపీ మాదిరి కకుర్తి పడే పద్ధతి మా ప్రభుత్వానికి లేదు

2:20 PM, Nov 15, 2023
బండారు హెబియస్‌ కార్పస్‌
►మాజీ మంత్రి బండారు సత్యనారాయణ భార్య పిటిషన్ పై విచారణ
►పోలీసులు అక్రమంగా నిర్బంధించారని హెబియస్ కార్పస్ పిటిషన్
►CC టీవీ ఫుటేజ్ కోర్టుకు సమర్పించడానికి సమయం కోరిన పోలీసులు
►విచారణ ఈనెల 27కి వాయిదా వేసిన హైకోర్టు

2:15 PM, Nov 15, 2023
బాబు బెయిల్‌@హైకోర్టు
►స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ప్రారంభం
►స్కిల్ కేసులో చంద్రబాబు కు బెయిల్ ఇవ్వొద్దని కోరిన సీఐడీ
►280 పేజీలతో అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసిన సీఐడీ

1:55 PM, Nov 15, 2023
హైకోర్టులో కొల్లు రవీంద్ర పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా
►మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కొల్లు రవీంద్ర పిటిషన్
►నిబంధనలకు విరుద్ధంగా మద్యం కంపెనీలకు అనుమతులిచ్చారన్న ఆరోపణలతో కేసు
►సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కొల్లు పిటిషన్
►కొల్లు రవీంద్ర పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

12:10 PM, Nov 15, 2023
బాబు పిటిషన్‌పై సీఐడీ అదనపు కౌంటర్‌ దాఖలు
►స్కిల్‌ స్కాంలో చంద్రబాబు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ. 
►చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై అదనపు కౌంటర్‌ దాఖలు చేసిన సీఐడీ. 
►కౌంటర్‌లో పలు కీలకమైన జడ్జిమెంట్లు ఉదహరించిన సీఐడీ. 

11:27 AM, Nov 15, 2023
అసైన్డ్‌ భూముల కుంభకోణం కేసు
►అసైన్డ్‌ భూముల స్కాంలో దాఖలైన 9 పిటిషన్లపై హైకోర్టులో విచారణ
►మాజీ మంత్రి నారాయణతో పాటు మరికొంత మంది దాఖలు చేసిన 9 క్వాష్‌, ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై విచారణ
►తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు

10:55 AM, Nov 15, 2023
స్కిల్‌ స్కాంలో బెయిల్‌ పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ
►స్కిల్‌ స్కాంలో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
►అదనపు కౌంటర్‌ దాఖలు చేస్తామన్న సీఐడీ తరఫు న్యాయవాదులు. 
►పాస్‌ ఓవర్‌ అడిగిన సీఐడీ తరఫు న్యాయవాదులు. 
►ఈరోజు మధ్యాహ్నం విచారించనున్న ఏపీ హైకోర్టు. 

10:16 AM, Nov 15, 2023
నేడు హైకోర్టులో చంద్రబాబు, నారాయణ కేసుల విచారణ
►స్కిల్‌ కుంభకోణం బెయిల్‌ పిటిషన్‌పై విచారణ
►అసైన్డ్‌ భూముల కుంభకోణంలో తనపై కేసును కొట్టేయాలంటూ నారాయణ దాఖలు చేసిన 2 క్యాష్‌ పిటిషన్లపై విచారణ
►స్కిల్‌ స్కాంలో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషన్‌
►అసైన్డ్‌ భూముల కుంభకోణంలో నారాయణ బినామి అంజనీకుమార్‌ ముందస్తు బెయిల్‌ కోసం దాఖలు చేసిన 2 పిటిషన్లపై విచారణ
►మద్యం కుంభకోణంలో మందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ కొల్లు రవీంద్ర పిటిషన్

9:44 AM, Nov 15, 2023
బాబుపై ఎన్ని కేసులు? ఎన్ని స్టేలు?
►దేశ రాజకీయాల్లో స్టేBNగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు
►1997లో రెడ్యానాయక్‌ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే 
►1998లో వైఎస్సార్‌ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే
►1999లో షబ్బీర్‌ అలీ, 1999లో డీఎల్‌ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే. 
►1999, 2000, 2001 వైఎస్సార్‌ గారు తిరిగి దావా వేస్తే స్టే. 
►2003లో కృష్ణకుమార్‌ గౌడ్‌ కేసు వేస్తే స్టే 
►2003లో కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసు ఏంటంటే పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్‌ పెట్టాడని దావా వేస్తే స్టే
►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే.
►2004లో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు 
►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ.. దాంట్లోనూ స్టే
►2005లో బాబు అక్రమాస్తులపై  లక్ష్మీపార్వతి హైకోర్టులో  కేసు వేస్తే స్టే 
►2005 శ్రీహరి, అశోక్‌ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే
►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే.

7:20 AM, Nov 15, 2023
టీడీపీ ‍శ్రేణుల్లో టెన్షన్‌..
►నవంబర్‌ 28న రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తిరిగి వెళ్లనున్న చంద్రబాబు. 
►సమయం ముంచుకొస్తుండటంతో చంద్రబాబు, టీడీపీలో కలవరం. 
►ఈలోగా కోర్టుల్లో ఊరట లభిస్తుందన్న ఆశలో చంద్రబాబు, టీడీపీ
►అత్యాశకు పోయి పిటిషన్ల మీద పిటిషన్లు వేసి కోర్టులను ఇరకాటంలో పెట్టిన టీడీపీ లీగల్‌ టీం. 
►ఇప్పుడు ఒకదానికి మరొకటి చిక్కుకుపోయి అసలుకే మోసం వచ్చే పరిస్థితి. 
►కేసులో బెయిల్‌ కోసం అడగకుండా క్వాష్‌ కోసం పట్టుబట్టడంతో సీన్‌ రివర్స్‌.

6:58 AM, Nov 15, 2023
టీడీపీ ఖాతాలోకి రూ.27 కోట్ల స్కిల్‌ స్కామ్‌ నిధులు
►హవాలా మార్గంలో చేరినట్టు గుర్తించిన సీఐడీ
►ఇతర కుంభకోణాల నిధులు కూడా చంద్రబాబు పార్టీ ఖాతాలోకే
►ఈ నిధుల గుట్టు రట్టు చేసేందుకు విచారణ వేగవంతం
►మొదట స్కిల్‌ స్కామ్‌లో కార్యాచరణకు ఉపక్రమణ
►టీడీపీ ప్రధాన కార్యాలయానికి నోటీసులు జారీ..
►18న తాము కోరిన వివరాలతో సిట్‌ కార్యాలయానికి రావాలని పేర్కొన్న సీఐడీ

6:55 AM, Nov 15, 2023
తెలంగాణ రాజకీయాలతో చంద్రబాబు బిజీ బిజీ
►వారం రోజులుగా తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు మంత్రాంగం
►విడతల వారీగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో వర్చువల్‌ మీటింగ్‌లు
►రేవంత్‌ రెడ్డికి పూర్తిగా అండగా ఉండాలని తెలంగాణ పార్టీ నేతలకు పిలుపు
►చంద్రబాబు ఆదేశాలతో నిన్న తుమ్మలను పార్టీ కార్యాలయానికి పిలిచిన ఖమ్మం టిడిపి నేతలు
►పూర్తి స్థాయిలో మద్ధతిస్తాం, ఆర్థికంగా అండగా నిలుస్తాం, ఇంకేం కావాలంటూ తుమ్మలకు ఆఫర్‌
►తెలంగాణలో కాంగ్రెస్‌ గెలవాలంటే ఎలాంటి సపోర్ట్‌ కావాలంటూ తెలంగాణ టిడిపి నేతల ఎదురు ఆఫర్లు
►అన్ని జిల్లాల్లో టిటిడిపి నేతలకు చంద్రబాబు నుంచి ఫోన్లు
►ఇక్కడ కాంగ్రెస్‌ ఉంటేనే.. మనకు ప్రయోజనం అంటూ చంద్రబాబు సందేశాలు

6:49 AM, Nov 15, 2023
చంద్రబాబు కేసుల స్టేటస్‌ ఏంటీ?
కేసు: స్కిల్ స్కాం 
అంశం: మధ్యంతర బెయిల్‌
స్టేటస్‌: అనారోగ్యం కారణంగా  మంజూరు
వివరణ: నవంబర్‌ 28న జైలు ముందు లొంగిపోవాలి

కేసు : స్కిల్ స్కాం 
అంశం: క్వాష్‌ పిటిషన్‌
స్టేటస్‌: సుప్రీంకోర్టులో పెండింగ్‌
వివరణ: ఈ నెలాఖరుకు తీర్పుకు ఛాన్స్‌

కేసు : స్కిల్ స్కాం 
అంశం: రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌
స్టేటస్‌: హైకోర్టులో జరుగుతున్న విచారణ
వివరణ: నవంబర్‌ 15కి వాయిదా పడ్డ కేసు

కేసు : ఇసుక కుంభకోణం
అంశం: ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
స్టేటస్‌: హైకోర్టులో జరుగుతున్న విచారణ
వివరణ: నవంబర్‌ 22కి తదుపరి విచారణ వాయిదా

కేసు : ఫైబర్‌ నెట్‌ పేరిట నిధుల దోపిడి
అంశం: ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
స్టేటస్‌: సుప్రీంకోర్టులో పెండింగ్‌
వివరణ: నవంబర్‌ 30కి తదుపరి విచారణ వాయిదా

కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు
అంశం: ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
స్టేటస్‌: మంజూరు చేసిన హైకోర్టు
వివరణ: ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు

కేసు: ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో అక్రమాల కేసు
అంశం: ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
స్టేటస్‌: హైకోర్టులో జరుగుతున్న విచారణ
వివరణ: నవంబర్‌ 22కి వాయిదా పడ్డ కేసు

కేసు: మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు
అంశం: 
ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
స్టేటస్‌: హైకోర్టులో జరుగుతున్న విచారణ
వివరణ: నవంబర్‌ 21కి వాయిదా పడ్డ కేసు.

రెండు వర్గాలుగా మారిన తెలుగుదేశం అగ్ర నేతలు
ఒక వర్గం:  ముందయితే ఎలాగైనా లోకేష్‌ను బుజ్జగించి పాదయాత్ర పునఃప్రారంభించాలి
రెండో వర్గం: ఇప్పుడు జనం ముందుకు లోకేష్ ను పంపితే పార్టీకి నష్టం. ఏదో ఒకటి మాట్లాడి అసలుకే మోసం

ఒక వర్గం:   కనీసం భువనేశ్వరీ యాత్ర నిజం గెలవాలి అయినా ప్రారంభించాలి
రెండో వర్గం: అసలే వద్దు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షలంటే బోలెడు ఖర్చు. ఎలాంటి సానుభూతి రావడం లేదు, డబ్బులెందుకు దండగ.?

ఒక వర్గం:  ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి, ఇలాగే ఉంటే.. పార్టీలో నిరాశ, నిస్తేజం, నిస్పృహ. ఎవరో ఒకరు ముందుకు రాకపోతే.. పార్టీ పరిస్థితి అంతే సంగతులు
రెండో వర్గం: పార్టీ అంటూ లోకేష్ ను ఫణంగా పెట్టుకుంటామా? చినబాబు ఢిల్లీ యాత్రలతో అలసిపోయారు, విశ్రాంతి తీసుకోనివ్వండి

6:47 AM, Nov 15, 2023
చంద్రబాబుకు ముంచుకొస్తున్న జైలు ముహూర్తం
►రాజకీయ చర్చలతో బిజీ బిజీగా చంద్రబాబు
►తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు సర్వ ప్రయత్నాలు
►సామాజిక వర్గం, టిటిడిపి నేతలతో నిరంతరాయంగా చర్చలు
►కేసుల రూపంలో వెంటాడుతున్న తప్పులు, అక్రమాలు
►వరుస పిటిషన్లతో కోర్టులపై ఒత్తిడి తెచ్చే కుట్ర

మరిన్ని వార్తలు