చంద్రబాబు వీడియో సందేశం

11 Oct, 2014 19:54 IST|Sakshi
చంద్రబాబు నాయుడు

హైదరాబాద్: హుదూద్ తుపానుపై రాష్ట్ర ప్రజలకు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో సందేశం ఇచ్చారు. తుపాను తీరం దాటేవరకు ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని కోరారు. 5 జిల్లాలలో సహాయ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వాతావరణ శాఖ నుంచి తుపాను తీవ్రతను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉపగ్రహ ఛాయా చిత్రాలను పంపాలని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్- ఇస్రో)ను కోరినట్లు తెలిపారు. 13 ఎన్డీఆర్ఎఫ్ టీవీలను, 15 శాటిలైట్ ఫోన్లు సిద్ధం చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు  రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చంద్రబాబు తెలిపారు.
**

>
మరిన్ని వార్తలు