ఆస్కార్‌ నుంచి '2018' సినిమా ఔట్‌.. ఆ చిత్రానికి దక్కిన ఛాన్స్‌

22 Dec, 2023 13:30 IST|Sakshi

ఆస్కార్‌ 2024 అవార్డుల కోసం భారత్‌ నుంచి మలయాళం బ్లాక్‌బస్టర్‌ ‘2018’  అధికారికంగా ఎంపిక కావడంతో భారతీయ చిత్రపరిశ్రమలోని అందరూ చాలా సంతోషించారు.  తాజాగా  అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రకటించిన 15 చిత్రాల షార్ట్‌లిస్ట్‌లో 2018 సినిమా పేరు లేదు. ఇదే విషయాన్ని ఆ సినిమా డైరెక్టర్‌ జూడ్​ ఆంథోనీ జోసెఫ్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు. జార్ఖండ్ గ్యాంగ్‌రేప్ ఆధారంగా తీసిన 'టు కిల్ ఎ టైగ‌ర్' అనే చిత్రం బెస్ట్ డాక్యుమెంట‌రీ క్యాట‌గిరీలో చోటు దక్కింది. టొరంటో ఫిల్మ్ మేక‌ర్ నిషా ప‌హుజా దీన్ని డైరెక్ట్ చేశాడు.

2018 సినిమా ఆస్కార్​ రేసు నుంచి తప్పుకోవడంతో  ఆ మూవీ డైరెక్టర్ జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌ ఇన్‌స్టా ద్వారా  తన బాధను వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 88 అంతర్జాతీయ భాషా చిత్రాలు పోటీ పడ్డాయని ఆయన తెలిపారు. కానీ ఫైనల్‌ చేసిన 15 చిత్రాల్లో 2018 సినిమా స్థానాన్ని దక్కించుకోలేకపోయిందని చెప్పారు. అవార్డు కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న అందరినీ ఎంతగానో నిరాశపరిచానని. అందుకు గాను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నట్లు ఆయన భావోద్వేగానికి లోనయ్యాడు. ఏదేమైనా ఆస్కార్‌ బరిలో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కడం ఎప్పటికీ మరిచిపోలేనని ఆయన తెలిపాడు.

వచ్చే ఏడాది ప్రదానం చేసే ఆస్కార్‌ అవార్డుల కోసం బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో '2018'ని ఎంపిక చేశారు. టోవినో థామస్‌ ప్రధాన పాత్రలో జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌ తెరకెక్కిన ఈ చిత్రం అందరి అభిమానాన్ని పొందింది. 2018లో కేరళలో సంభవించిన వరదల ఆధారంగా రియల్‌స్టిక్‌గా జరిగిన కొన్న సంగటనల ఆధారం చేసుకుని ఈ కథను వెండితెరపైకి తీసుకొచ్చారు. ఈ సినిమాను భాషతో సంబంధం లేకుండా ఇతర భాషల సినీ ప్రేక్షకులను కూడా మెప్పించింది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద రూ.100కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఆస్కార్‌-96 నుంచి ఈ సినిమా తప్పుకోవడంతో భారతీయ చలనచిత్ర అభిమానుల్లో కొంతమేరకు నిరాశ కలిగింది. 

A post shared by Jude Anthany Joseph (@judeanthanyjoseph)

>
మరిన్ని వార్తలు