చిత్తూరులో ఉద్రిక్తత

9 Apr, 2017 09:28 IST|Sakshi
చిత్తూరులో ఉద్రిక్తత

చిత్తూరు: చిత్తూరు నగరపాలక కార్పొరేటర్‌ ఉపఎన్నిక పోలింగ్‌ను పరిశీలించేందుకు వెళ్తున్న వైఎస్‌ఆర్ సీపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వైఎస్‌ఆర్‌ సీసీ జిల్లా అధ్యక్షుడు నారాయణ స్వామి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో చిత్తూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

చిత్తూరు జిల్లాలోని రెండు రెండు మున్సిపాలిటీ వార్డులకు నేడు ఉపఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికార టీడీపీ భారీగా ప్రలోభాలకు, బెదిరింపులకు దిగుతోంది. చిత్తూరులోని 38వ డివిజన్‌ ఉపఎన్నికలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సీ. జ్యోతికి లభిస్తున్న ప్రజామద్దతును గమనించిన అధికార పార్టీ నేతలు.. పోలింగ్‌ ఏజెంట్లను బెదిరించడంతో పాటు భారీగా డబ్బు వెదజల్లుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్‌ను పరిశీలించేందుకు వెళ్తున్న వైఎస్‌ఆర్‌ సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలమనేరులోని 23 వ వార్డు ఎన్నికల్లో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మహ్మద్‌ నియాజ్‌పై టీడీపీ మదన్‌మోహన్‌ను పోటీకి దింపింది. ఈ వార్డును కైవశం చేసుకోవడానికి స్వయానా రాష్ట్ర మంత్రి అమర్నాథ్‌రెడ్డి రంగ ప్రవేశం చేశారు. పోలీసులు అధికార పక్షానికి అనుకూలంగా పనిచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు