పరారీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

19 Nov, 2023 10:36 IST|Sakshi

సాక్షి, గుంటూరు: నాలుగు రోజుల క్రితం ఏలూరుకు చెందిన రైతులపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే  ధూళిపాళ్ల నరేంద్ర అనుచరుల దాడి చేసిన సంగతి తెలిసిందే.  సంగం డెయిరీకి పాలు పోయించుకుని బోనస్‌ ఇస్తామంటూ ధూళిపాళ్ల మోసానికి తెరతీశాడు. సంగం డెయిరీ యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన రైతులపై దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాడ్డులతో విక్షచణారహితంగా ధూళిపాళ్ల అనుచరులు దాడి చేశారు. దాడిలో పలువురు రైతులు గాయపడ్డారు.

బాధితుల ఫిర్యాదుతో ధూళిపాళ్ల నరేంద్రతో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు పోలీసులు .. వారిని పట్టుకోవడానికి మూడు స్పెషల్‌ టీంలుగా రంగంలోకి దిగారు.. నిన్న రాత్రి నుంచి నరేంద్రతో పాటు ఆయన అనుచరులు పరారీలో ఉన్నారు. నరేంద్ర ఫోన్‌ కూడా స్విచ్‌ ఆఫ్‌ చేశారు.
చదవండి: పెత్తందార్ల పెద్దా.. ఇదేనా మీ బాధ! 

మరిన్ని వార్తలు