మార్కెట్‌కు పెరుగుతున్న మిర్చి

8 Feb, 2014 02:25 IST|Sakshi
మార్కెట్‌కు పెరుగుతున్న మిర్చి

వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు రైతులు అమ్మకానికి తీసుకొచ్చే మిర్చి బస్తా ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వారం క్రితం వరకు 1000-2000 బస్తాల మిర్చి రాగా, ప్రస్తుతం 3నుంచి 4వేల వరకు మిర్చి బస్తాలను తీసుకొస్తున్నారు. మేడారం జాతర ముగిశాక మార్చి మొదటి వారం నుం చి మిర్చి సీజన్ ప్రారంభమయ్యే అవకాశముందని వ్యా పారులు చెబుతున్నారు.

కాగా, శుక్రవారం 4,616 బస్తా ల మిర్చి రాగా, వండర్‌హాట్, యూఎస్-341 రకాలను పోలి ఉన్న 1055 రకం మిర్చి భూపాలపల్లి మండలానికి గుగులోతు రాజు తీసుకొచ్చారు. ఈ మిర్చిని చూడడానికి రైతులు, వ్యాపారులు ఆసక్తి కనబరిచారు. ప్రస్తుతం తేజ రకానికి 9వేల వరకు ధర పలుకుతుండగా యూఎస్-341, వండర్ హాట్ రకాలకు రూ.9,500 ధర పలుకుతోంది. ఇక దేశీ రకం మిర్చి మార్కెట్‌కు ఇంతవరకు రాకపోగా, ఈ సారి క్వింటాల్‌కు రూ.15వేల పైచిలుకు ధర పలుకుతుందని భావిస్తున్నారు.
 
సోమ, మంగళవారాల్లో మిర్చి,పత్తి మార్కెట్ ఉంటుంది

మేడారం జాతర సందర్భంగా వచ్చే సోమవారం నుంచి ఆదివారం వరకు మార్కెట్ సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సోమ, మంగళవారాల్లో పత్తి, మిర్చి మార్కెట్ నడుస్తుందని, అపరాలు, పల్లి, పసుపు, మక్కలు, ధాన్యం యార్డులకు మాత్రం సెలవు ఉంటుందని మార్కెట్ చైర్మన్ మంద వినోద్‌కుమార్, కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని వారు కోరారు.

 

మరిన్ని వార్తలు