విజయనగరం జిల్లాలో గ్రామసభ రసాభాస

8 Feb, 2017 11:42 IST|Sakshi

విజయనగరం: విజయనగరం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పూసపాటిరేగ మండలం పువ్వాడ గ్రామంలో నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. ఎన్‌వీఎస్‌ ఫార్మా కంపెనీ పర్యావరణ అనుమతుల కోసం బుధవారం గ్రామసభ నిర్వహించింది. ఈ సభలో రైతులు ఆందోళనకు దిగడంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

భోగాపురం ఎయిర్‌పోర్టు బాధితులకు ఇచ్చిన విధంగానే తమకు నష్ట పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆ డిమాండ్‌కు అంగీకరిస్తేనే భూములు ఇస్తామని వారు తేల్చి చెబుతున్నారు. రైతులకు స్థానిక వామపక్ష నేతలు మద్దతుగా నిలిచారు. గ్రామసభలో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వామపక్ష నేతలను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు