‘విద్యార్థులను మోసం చేసిన చంద్రబాబు’

29 Aug, 2019 17:04 IST|Sakshi

సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులను మోసం చేశారని డిప్యూటీ  సీఎం పుష్ప శ్రీవాణి  ఆరోపించారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రియంబర్స్‌మెంట్‌లు చెల్లించకుండ విద్యార్థులను ఇబ్బంది పెట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఎస్సీ, ఎస్టీ హాస్టల్‌ బిల్లులను కూడా చంద్రబాబు మళ్లీంచారని మండిపడ్డారు. సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి చంద్రబాబు హయాంలోని బకాయిలన్నింటిని తీర్చి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చిన హామీల అమలుకు పెద్ద పీట వేస్తూ.. విద్యార్థులకు 20 వేల చొప్పున హాస్టల్‌, మెస్‌ చార్జీలను ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే గిరిజన హాస్టళ్లు, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి వారికి నాణ్యమైన విద్యను అందించేందుకు తొమ్మిది రకాల ప్రమాణాలను రూపొందిస్తున్నామని అన్నారు. గురుకుల హాస్టల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తి చేస్తామని, మానిఫెస్టోలో చెప్పిన ప్రకారం గిరిజన యూనివర్సిటీ, మేడికల్‌ కాలేజిలు ఏర్పాటు చేస్తామని పుష్ప శ్రీ వాణి పేర్కొన్నారు.

కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్‌ కాలేజి ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారని, త్వరలోనే దానికి ఆయన శంఖుస్థాపన చేయనున్నట్లు పుష్ప శ్రీవాణి వెల్లడించారు. ఎస్టీ, ఎస్సీ, మైనారిటీలకు నామినేటెడ్‌ పదవులను, అలాగే నామినేషన్‌ వర్కులలోను యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం అందించే ఉద్దేశ్యంతో  వైఎస్సార్‌ చేయూత పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. దీని కింద ఏడాదికి 18,750 రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం వెంటనే తగిన ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఇది జగన్‌ ప్రభుత్వం.. లంచాలు ఉండవు’

వసతి గృహాల్లో అన్ని సౌకర్యాలు ఉండాలి: సీఎం జగన్‌

ప్రతి నెలా రైతుల సమస్యలు చర్చిస్తాం: నాగిరెడ్డి

బాబుకు హృదయ కాలేయంగా మారాడు!

‘సీఎం జగన్‌​ మాట నిలబెట్టుకున్నారు’

భిక్ష కాదు...లక్ష, కాదు కాదు మూడు లక్షలు...!!

బ్రాహ్మణ విద్యార్థులకు వరం..'భారతి విద్యా పథకం'

‘సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయం అభినందనీయం’

సర్కారీ మద్యం దుకాణాలు సిద్ధం

హోదా ఇవ్వడం జరిగేది కాదు : కన్నా

బాటిల్‌ మహల్‌

‘పోలవరం నిర్వాసితులకు భరోసా’

గ్రానైట్‌ వాణిజ్యంతో ఖజానాకు గండి

చీరాల ఎమ్మెల్యే బలరాంపై కేసు నమోదు

వివిధ శాఖలపై సీఎం జగన్‌ సమీక్ష

తొలి తెలుగు పద్యానికి పుట్టినిల్లు ప్రకాశం

కోడెల అక్రమ నిర్మాణంపై చర్యలు

చెరబట్టబోయాడు.. చనిపోయింది!

ప్రభుత్వ ఉత్తర్వులన్నీ తెలుగులో ఉండాలి: వెంకయ్య

నష్ట పరిహారం.. ఇక 15 శాతం అదనం

తస్సాదియ్యా.. రొయ్య..

తెలుగు ఔన్నత్యాన్ని చాటుదాం: సీఎం జగన్‌

ఏపీ భవన్‌ ఓఎస్డీగా అరవింద్‌ నియామకం

నకిలీలను అరికడతాం: మంత్రి కన్నబాబు

తొలిబండికి లారీ రూపంలో ప్రమాదం

ఎదురు ప్రశ్నిస్తే.. మరింత చితకబాదుతున్నాడు..!

రాజన్న సంతకం: చెరగని జ్ఞాపకం

అవినీతి బయటపడుతుందనే చంద్రబాబుకు వణుకు

ఆపరేషన్‌ చెన్నై చికెన్‌

ఎపుడో అపుడు... ఎవరో ఒకరు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హౌస్‌మేట్స్‌కు చుక్కలు చూపించిన బాబా భాస్కర్‌

‘కేజీఎఫ్‌’ టీంకు షాక్‌.. షూటింగ్‌ ఆపాలన్న కోర్టు

సాహో అ'ధర'హో!

బోలెడన్ని గెటప్పులు

అక్షరాలు తింటాం.. పుస్తకాలు కప్పుకుంటాం

ఆసియాలో అతి పెద్ద స్క్రీన్‌